సరోగసి వివాదంలో నయనతార విఘ్నేష్ శివన్ సేఫ్.. క్లీన్ చిట్ అంటూ?

నయనతార విఘ్నేష్ శివన్ పెళ్లి జరిగే నాలుగు నెలలే కాగా సరోగసి విధానంలో నయన్ విఘ్నేష్ పిల్లలకు జన్మనివ్వడం విమర్శలకు తావిచ్చింది.

అయితే ఈ కేసులో నయన్ విఘ్నేష్ లకు క్లీన్ చిట్ రానుందని సమాచారం అందుతోంది.

నయన్ విఘ్నేష్ సెలబ్రిటీలు కావడంతో పాటు లీగల్ గా ఎలాంటి ఇబ్బందులు రాకుండా నయన్ విఘ్నేష్ పిల్లల్ని కన్నారని తెలుస్తోంది.

నయన్ విఘ్నేష్ ల సరోగసి కేసు గురించి విచారణ చేయడానికి తమిళనాడు సర్కార్ త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది.

ఈ కమిటీకి మెడికల్ అండ్ రూరల్ హెల్త్ సర్వీసెస్ డైరెక్టర్ విశ్వనాథన్ సారథ్యం వహిస్తున్నారు.

ఈ కేసు గురించి విశ్వనాథన్ స్పందిస్తూ తాజాగా చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి.

సరోగసి ద్వారా నయన్ విఘ్నేష్ పిల్లల్ని కనడం విషయంలో ఇప్పటివరకు తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని విశ్వనాథన్ చెప్పుకొచ్చారు.

ఈ విషయంలో ఎలాంటి కేసు నమోదు కాలేదని విశ్వనాథన్ చెప్పుకొచ్చారు. """/"/ అయితే ఈ వివాదం గురించి కేసులు నమోదు కాకపోయినా మేం పారదర్శకంగా ఉన్నామని చెప్పాలని అనుకున్నామని ఈ కారణం వల్లే ప్రభుత్వం తరపున స్వతహాగా దర్యాప్తు చేపట్టామని విశ్వనాథన్ కామెంట్లు చేశారు.

ప్రాథమిక విచారణలో మాత్రం నయన్ విఘ్నేష్ రూల్స్ అతిక్రమించినట్టు ఎలాంటి ఆధారాలు లభించలేదని విశ్వనాథన్ చెప్పుకొచ్చారు.

ఆస్పత్రుల ఫైళ్లను పరిశీలించిన తర్వాతే పూర్తి వివరాలు తెలుస్తాయని విశ్వనాథన్ అన్నారు.విశ్వనాథన్ వెల్లడించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి.

నయన్ విఘ్నేష్ ఈ వివాదం నుంచి బయటపడాలని అభిమానులు కోరుకుంటున్నారు.నయనతార విఘ్నేష్ శివన్ ఈ వివాదానికి సంబంధించి పూర్తిస్థాయిలో క్లారిటీ ఇస్తే బాగుంటుందని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

నయనతార ప్రస్తుతం పలు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు.

ఇంటెల్ సీటీవో , ఏఐ చీఫ్‌గా భారత సంతతి ఎగ్జిక్యూటివ్.. ఎవరీ సచిన్ కట్టి?