తెలంగాణ కాంగ్రెస్‎లో బయటపడ్డ వర్గ విభేదాలు

తెలంగాణ కాంగ్రెస్ లో మరోసారి వర్గ విభేదాలు బయటపడ్డాయి.పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే సమక్షంలో వివాదాలు వెలుగు చూశాయి.

టీడీపీ నుంచి వచ్చిన వారితో ఇబ్బందిగా ఉందని దామోదర్ రెడ్డి వర్గానికి చెందిన నేతలు ఆరోపిస్తున్నారు.

ఈ క్రమంలోనే పటేల్ రమేశ్ రెడ్డిపై రాంరెడ్డి దామోదర్ రెడ్డి వర్గం ఠాక్రేకు ఫిర్యాదు చేశారు.

రమేశ్ రెడ్డి పార్టీ లైన్ దాటి వ్యవహరిస్తున్నారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు.దీంతో ఇదేం పద్ధతి అంటూ పటేల్ రమేశ్ రెడ్డి ఉత్తమ్ వద్ద నిరసన వ్యక్తం చేశారని తెలుస్తోంది.

పార్టీ కార్యక్రమాలకు కనీస సమాచారం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ క్రమంలోనే దామోదర్ రెడ్డి, రమేశ్ రెడ్డి వర్గాల వాగ్వివాదం చెలరేగింది.

రొమేనియాలో షాకింగ్ ఘటన.. మహిళా యజమానిని పీక్కుతిన్న పెంపుడు కుక్కలు..