ముంబై లోకల్ ట్రైన్‌లో సీటు కోసం గొడవ.. ఎలా తన్నుకున్నారో చూడండి..

ముంబై, ఢిల్లీ నగరాలలోని మెట్రో ట్రైన్లలో( Metro Trains ) ఏదో ఒక గొడవ లేదా వాగ్వాదం జరగడం కామన్ గా మారింది.

రీసెంట్‌గా జనాలతో కిటకిటలాడుతున్న ముంబై లోకల్ ట్రైన్‌లో( Mumbai Local Train ) ఇద్దరు వ్యక్తులు సీట్ విషయంలో గొడవ పడ్డారు.

ఢిల్లీ మెట్రోలా కాకుండా అదృష్టవశాత్తు ఈ ముంబై ట్రైన్‌లో వారిద్దరూ తన్నుకోవడాన్ని ఆపడానికి ఒకరు ముందుకొచ్చారు.

ఈ వ్యక్తి వారిద్దరిని శాంతపరచి గొడవ పెద్దది కాకుండా ఆపాడు.ఈ గొడవకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ గొడవను ఆపిన వ్యక్తిని కొందరు ప్రశంసించారు. """/" / @gharkekalesh ట్విట్టర్ యూజర్ షేర్ చేసిన ఈ వీడియో నిడివి ఒక నిమిషం ఉంది.

ఇది ఓపెన్ చేయగానే ఇద్దరు యువకులు ఒకరికొకరు ఎదురుగా నిల్చని ఉండటం మనం చూడవచ్చు.

క్షణాల్లోనే వారు ఒకరినొకరు నెట్టుకుంటూ కనిపించారు.అనంతరం మెడ పట్టుకోవడానికి ఒక వ్యక్తి ట్రై చేశాడు.

ఆ వ్యక్తికి సంబంధించిన మరో వ్యక్తి కూడా ఒక పంచ్ విసిరాడు.అయితే వీరిద్దరి గొడవ ( Fight ) తీవ్రతరం అవుతున్న నేపథ్యంలోనే ఒక వ్యక్తి మధ్యలో కలగజేసుకున్నాడు.

వారిద్దరిని పక్కకి నెట్టేసి గొడవ పడొద్దు అని నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు.దాంతో ఈ గొడవ సద్దుమణిగింది.

"""/" / ఒక బాక్సింగ్ రింగులో రెఫరీ లాగా వచ్చి వీరిద్దరిని ఆపిన సదరు ప్రయాణికుడని( Passanger ) చాలామంది పొగుడుతున్నారు.

ఈ వీడియోని మీరు కూడా చూసేయండి.అలాగే రైలు ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఇతరులతో గొడవకు దిగకుండా శాంతంగా సర్దుకోవడం మంచిదని చాలామంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

గంట, రెండు గంటల ప్రయాణం కోసం అనవసరంగా దెబ్బలాడుకోవడం ఎందుకని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.

సంచలనం సృష్టించిన త్రిష..