పవన్ బీజేపీ మద్య క్లాష్.. కారణమదే !

ఏపీ రాజకీయల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.ముఖ్యంగా టీడీపీ జనసేన బీజేపీ మద్య రాజకీయ వ్యూహాలు వేగంగా మారుతున్నాయి.

ఈ మూడు పార్టీలు గత కొన్నాళ్లుగా పొత్తుల కోసం మల్లగుల్లాలు పడుతున్నాయి.మొదటి నుంచి బీజేపీ తో దోస్తీలో ఉన్న జనసేన అనూహ్యంగా టీడీపీతో జట్టు కట్టింది.

ఇక బీజేపీ కూడా టీడీపీతో కలుస్తుందని పవన్ బీజేపీ టీడీపీ మద్య వారధిలా వ్యవహరిస్తున్నారనే టాక్ వినిపించింది.

పవన్ కూడా ఇతరహా వ్యాఖ్యలు చేశారు.టీడీపీ బీజేపీ ( TDP BJP )మద్య అసంబద్దత కొనసాగుతోందని, త్వరలోనే అన్నీ అవాంతరాలు తొలగిపోయి త్రిముఖ కూటమి ఏర్పడుతుందని మొదటి నుంచి కూడా చెబుతూ వచ్చారు.

"""/" / కానీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు( Chandrababu Naidu ) జైలుకు వెళ్ళిన తరువాత రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోయాయి.

ఊహించని విధంగా పవన్ టీడీపీతో పొత్తు ప్రకటించి బీజేపీని పట్టించుకోవడం మానేశారు.కానీ బీజేపీ నేతలు మాత్రం పవన్ తమతోనే ఉన్నడని, జనసేనతో తమ పొత్తు కొనసాగుతుందని స్పష్టం చేస్తూ వచ్చారు.

కానీ ఊహించని విధంగా దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు పవన్.( Pawan Kalyan ) తాజాగా ఎన్డీయే నుంచి జనసేన బయటకు వచ్చినట్లు చెప్పుకొచ్చారు.

దీంతో ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. """/" / పవన్ ( Pawan Kalyan )ఎన్డీయే నుంచి బయటకు వచ్చాడని క్లారిటీ ఇవ్వడంతో బీజేపీతో పొత్తు తెగతెంపులు చేసుకున్నట్లే.

ఇంతకీ ఎన్డీయే నుంచి పవన్ ;ఎందుకు బయటకు రావాల్సి వచ్చింది అనే దానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది.

టీడీపీ బీజేపీ కలయిక కోసం పవన్ ఎంత ప్రయత్నించిన బీజేపీ పెద్దలు ఆసక్తి చూపలేదట.

అంతే కాకుండా బీజేపీ జనసేన పొత్తులో భాగంగా సి‌ఎం అభ్యర్థిగా బీజేపీకి చెందిన వారే ఉండాలని బీజేపీ డిమాండ్ చేస్తోందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

అందుకే ఎన్డీయే నుంచి బయటకు వచ్చి టీడీపీతో పొత్తు కన్ఫర్మ్ చేశారని రాజకీయ వర్గాల్లో నడుస్తున్న చర్చ.

మొత్తానికి ఎన్డీయే నుంచి జనసేన బయటకు రావడం బీజేపీకి కోలుకోలేని దేబ్బె అని చెప్పాలి.

ఇకపై ప్రాంతీయ భాషల్లో కూడా గూగుల్ జెమినీ ఏఐ!