ఈ నందమూరి హీరోలకు ఏమైంది..? బాబాయ్ అబ్బాయ్ లకు చెడిందా ..?

బాబాయ్ - అబ్బాయ్, అబ్బాయ్ - బాబాయ్ అంటూ ఆప్యాయపు పిలుపులు ఇప్పుడు ఆ కుటుంబంలో కనిపించడం లేదు.

ఎడమొఖం పెడమొఖం అన్నట్టుగానే వారు ఉంటున్నారు.గతంలో ఉన్న ఆ అనుబంధం మాటల్లో కూడా కనిపించడం లేదు.

ఆ కుటుంబమే నందమూరి కుటుంబం.నందమూరి హీరోలైన బాలయ్య , కళ్యాణ్ రామ్ జూనియర్ ఎన్టీఆర్ ల మధ్య ఒకరకమైన అనుబంధం కనిపించేది.

కానీ ఆ ఇద్దరు యువ హీరోలు బాబాయ్ బాలయ్యను పక్కకు పెట్టేసినట్టు కనిపిస్తోంది.

ఒకప్పుడు కళ్యాణ్ రామ్ - జూనియర్ ఎన్టీఆర్ దూరం దూరంగా ఉన్నట్టు కనిపించేవారు.

కానీ ఇప్పుడు వారిద్దరూ బాగా క్లోజ్ అయిపోయి బాబాయ్ బాలయ్య కు దూరం అయ్యారు.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ ఇద్దరు ఇప్పుడు సొంత అన్నదమ్ములా మెలుగుతున్నారు.తారక్ లేనిదే కళ్యాణ్ రామ్ సినిమా ఆడియో ఫంక్షన్లు జరగవు.

అన్నయ్య-తమ్ముడు అంటూ ఆప్యాయంగా మెలుగుతున్నారు.అది చూసిన బాలయ్యకు ఎక్కడో కాలింది.

అప్పటి నుంచి బాలయ్య కళ్యాణ్ రామ్ ను పక్కనబెట్టేసాడు.ఇది జరిగి చాలా కాలమవుతోంది.

అయితే తాజాగా జరిగిన కళ్యాణ్ రామ్ ఇంటర్వ్యూలో ఇదంతా నిజమేనని మరోసారి ఆయన మాటల్లోనే చెప్పేసాడు.

!--nextpage నిన్నటి తరం హీరోల్లో తనకు నచ్చిన లక్షణాలు గురిచి చెబుతూ చిరంజీవి, నాగార్జు, వెంకటేష్ ల గురిచి ప్రస్తావించాడు గానీ.

సొంత బాబాయ్ బాలయ్య పేరు ఎక్కడా చెప్పకపోవడం అందరిని ఆశ్చర్యపరిచింది.అంతే కాదు ఎన్టీఆర్ బయోపిక్ విషయం కూడా తనకు పెద్దగా తెలియదని ముఖం చాటేసాడు.

తేజ దర్శకుడిగా ఉన్నప్పుడు ఓ పాత్ర కోసం అడిగారని తర్వాత ఎలాంటి అప్ డేట్ లేదని చెప్పాడు కళ్యాణ్ రామ్ చెప్పాడు.

అంతేకాకుండా బాబాయ్ అబ్బాయ్ ల మధ గ్యాప్ రావడానికి రాజకీయ కారణాలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది.

ఈ మధ్యనే టీడీపీ కి మా ఇద్దరు అబ్బాయిలు నేను ప్రచారం చేయబోమని నందమూరి హరికృష్ణ చెప్పడం ఇక్కడ కొసమెరుపు.

మొత్తానికి నందమూరి కుటుంబంలో చిచ్చు రేగింది అన్నది వాస్తవం .

ఇందిరమ్మ ఇళ్లతో పేదలకు ఆత్మగౌరవం:ఎమ్మెల్యే