పుష్ప ది రూల్ కు బాలీవుడ్ లో భారీ షాక్.. ఆ సినిమాతో పోటీ వల్ల ఇబ్బందేనా?

టాలీవుడ్ పాన్ ఇండియా హీరో అల్లు అర్జున్( Allu Arjun ) గురించి మనందరికీ తెలిసిందే.

అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 మూవీలో( Pushpa 2 ) నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు.

ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.అయితే అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా పుష్ప 2 కు టీజర్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే.

భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా టీజర్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది.

ఈ టీజర్ ని చూసిన అభిమానులు ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

"""/" / ఈ సినిమాను డిసెంబర్ ఆరవ తేదీన గ్రాండ్గా విడుదల చేయబోతున్న విషయం తెలిసిందే.

కాగా ప్రస్తుతం సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా పుష్ప 2.

ఈ మూవీ పై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది.అయితే ఈ సినిమాని డిసెంబర్ 6న విడుదల చేయాలని అనుకున్న మూవీ మేకర్స్ మళ్ళీ డిసెంబర్ 5కి మార్చారు.

ఇక డిసెంబర్ 6న విక్కీ కౌశల్( Vicky Kaushal ) ప్రధాన పాత్రలో నటించిన చావా( Chhaava ) అనే చారిత్రక వార్ మూవీ కూడా విడుదల కావాల్సి ఉంది.

అయితే పుష్ప 2 పై భారీ అంచనాలు ఉండటం వల్ల చావా చిత్ర బృందం తమ సినిమాను వాయిదా వేయాలని పరిశీలిస్తున్నారని వార్తలు వచ్చాయి.

పుష్ప 2 సునామీ ముందు చావా నిలబడలేదనే భయంతోనే ఈ నిర్ణయం తీసుకుంటున్నారని భావించారు.

"""/" / కానీ తాజా అందిన సమాచారం ప్రకారం, చావా ఇంకా డిసెంబర్ 6నే విడుదలకు సిద్ధంగా ఉందట.

పుష్ప సినిమాకు వాళ్ళు పెద్దగా భయపడటం లేదని టాక్ వినిపిస్తోంది.ఇప్పటికే పరిశ్రమలో సినిమాల కొరత ఉండటంతో ఒకదానితో ఒకటి క్లాష్ అవుతూ విడుదలకు సిద్ధం అవుతుండటం చిత్ర వర్గాల్లో నిరాశను కలిగిస్తోంది.

డిసెంబర్ 6 ఎలాంటి సెలవు రోజు కానందున ఈ పోటీ ఇరువురు నిర్మాతలకు వ్యాపార పరంగా నష్టాన్ని కలిగించే అవకాశం ఉంద.

ప్రత్యేకించి ప్రారంభ దశలో విడుదలైన చిత్రం ఎక్కువ షేర్ రేటు సంపాదించడానికి అవకాశం ఉంటుంది, కానీ పోటీ కారణంగా ఈ వసూళ్లు తగ్గే ప్రమాదం ఉంది.

అయితే నిన్న మొన్న వరకు అల్లు అర్జున్ అభిమానులకు మూవీ మేకర్స్ కి సినిమా విడుదల విషయంలో ఎలాంటి భయం లేకుండా ఉండేది.

కానీ ఇప్పుడు చావా సినిమా ఈ సినిమాకు పోటీగా నిలుస్తున్నడంతో అభిమానులు అలాగే మూవీ మేకర్స్ ఈ సినిమా పట్ల కాస్త ఆలోచనలో పడ్డట్టు తెలుస్తోంది.

చిరంజీవితో సినిమా చేయాలంటే ఈ ఆస్థాన రచయితల సలహాలు కూడా తీసుకోవాల్సిందే…