ఖమ్మం ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో ఘర్షణ

ఖమ్మం జిల్లాలో దివంగత నేత ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలలో ఘర్షణ చెలరేగింది.మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ ఆయన అనుచరులు ఓ యువకుడిని చితకబాదారు.

ఖమ్మం ఎన్టీఆర్ సర్కిల్ లో ఈ ఘటన చోటు చేసుకుంది.దీంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

కాగా మంత్రి పువ్వాడపై కొత్తగూడెంకు చెందిన కార్తీక్ అనే వ్యక్తి సోషల్ మీడియా వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.

అల్లు అర్జున్ జాతకం పై వేణు స్వామి కామెంట్స్… అసలు సినిమా ముందుంది అంటూ?