ఎమ్మెల్యేలకు ఎర కేసులో సీబీఐ దర్యాప్తుపై క్లారిటీ..!

ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో సీబీఐ దర్యాప్తుపై తెలంగాణ హైకోర్టు ఇవాళ క్లారిటీ ఇవ్వనుంది.

ఇటీవల సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై మూడు వారాలు స్టే ఇవ్వాలని హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది.

ఇందులో భాగంగా ఇవాళ చీఫ్ జస్టిస్ బెంచ్ ముందు ప్రభుత్వం అనుమతి తీసుకోనుంది.

అదేవిధంగా డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సర్కార్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది.

మరోవైపు సింగిల్ బెంచ్ తీర్పు నేపథ్యంలో రంగంలోకి దిగిన సీబీఐ కేసు వివరాలు ఇవ్వాలని ప్రభుత్వానికి మూడు సార్లు లేఖ రాసింది.

అయినా ఇప్పటివరకు ప్రభుత్వం సీబీఐకి కేసు వివరాలు సమర్పించలేదన్న విషయం తెలిసిందే.

బాలయ్య సినిమాకు పోటీగా ప్రభాస్ సినిమా రిలీజ్ కానుందా.. రిలీజయ్యేది అప్పుడేనా?