తరుణ్ పెళ్లి మీద క్లారిటీ వచ్చింది అప్పుడే పెళ్లి..?

నువ్వే కావాలి( Nuvve kavali ) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన తరుణ్( Tharun ) ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.అప్పట్లో ఆయన చేసిన నువ్వే కావాలి, నువ్వులేక నేను లేను, నువ్వే నువ్వే లాంటి సూపర్ హిట్స్ సినిమాలతో యూత్ లో లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చుకున్నాడు.చైల్డ్ ఆర్టిస్ట్ గా , హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కిన్చుకున్నాడు .అయితే హీరోగా ఎంత వేగంగా సక్సెస్ లు అందుకొని స్టార్ గా మారాడో.అంతే స్థాయిలో కె ఫ్లాప్ లతో క్రింద పడిపోయాడు.2009 వరకు తరుణ్ కెరియర్ స్పీడ్ గా కొనసాగింది.తరువాత కొంతకాలం బ్రేక్ ఇచ్చాడు.2013లో చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి అనే మూవీ చేశాడు.ఇది ప్లాప్ అయ్యింది.

తరువాత 2014లో రెండు సినిమాలు చేస్తే అవి కూడా విజయాన్ని డ్డునించలేకపోయాయి.మరలగ్యాప్ తీసుకొని 2018లో ఇది నా లవ్ స్టొరీ( Naa love story ) అనే మూవీ చేశాడు.ఆ తరువాత స్క్రీన్ పై ఇప్పటి వరకు కనిపించలేదు.అయితే త్వరలో ఒక సినిమా, వెబ్ సిరీస్ తో తరుణ్ గ్రాండ్ ఎంట్రీ ఇస్తాడని తెలుస్తుంది .దీనిపై అతని తల్లి రోజా రమణి క్లారిటీ ఇచ్చేశారు .తన కొడుకు తరుణ్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

ప్రస్తుతం తరుణ్ వ్యాపారాలలో బిజీగా ఉండటం వలన సినిమలపై పెద్దగా దృష్టి పెట్టడం లేదని క్లారిటీ ఇచ్చారు.అయితే త్వరలోనే రీ ఎంట్రీ ఉంటుందని అయితే వెబ్ సిరీస్ ద్వారానా, సినిమా ద్వారానా అనేది తెలియాల్సి ఉందని చెప్పారు.తాను కూడా తరుణ్ మంచి సినిమాతో మళ్ళీ ప్రేక్షకులని అలరించాలని వెయిటింగ్ చేస్తున్నానని తెలిపారు.తన కుమారుడు పెళ్లి చేసుకోవాలని, అన్ని బాగుండాలని కోరుకుంటున్నా అన్నారు.తన చేతుల మీదుగా ఎంతో మందికి పెళ్లిళ్లు చేసినట్లు చెబుతూ., ఆ ఆశీర్వాదాలు తనకు కుమారుడి దక్కుతాయని ఆశిస్తున్నట్లు తెలిపారు.ఇక తరుణ్ కి పెళ్లి సంబంధాలు కూడా చూస్తున్నట్టు తెలుస్తుంది.

అకీరా నందన్ వర్సెస్ గౌతమ్.. టాలీవుడ్ సూపర్ స్టార్ అనిపించుకునే హీరో ఎవరో?