ఆచార్యలో చరణ్ పాత్ర నిడివి పై క్లారిటీ ఇచ్చిన చిత్రబృందం!

మెగాస్టార్ రీ ఎంట్రీ తర్వాత వరుస సినిమాల్లో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.

ఈ క్రమంలోనే కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఆచార్య చిత్రంలో నటించారు.

ఇందులో మెగాహీరోతో పాటు తన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సిద్దు అనే పాత్రలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.

ఇందులో రామ్ చరణ్ పాత్ర అత్యంత కీలకంగా ఉండబోతోందని తాజాగా విడుదలైన టీజర్ చూస్తేనే అర్థమవుతుంది.

ఇకపోతే ఈ సినిమాలో చరణ్ పాత్ర నిడివి ఎంత సేపు ఉంటుందన్న విషయం గురించి పెద్దఎత్తున చర్చలు జరుగుతున్నాయి.

కేవలం కొంత సమయం పాటు మాత్రమే రామ్ చరణ్ ఇందులో కనిపించబోతున్నారని, అరగంటకు పైగా రామ్ చరణ్ సందడి చేయబోతున్నారు అని పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి.

అయితే తాజాగా చిత్రబృందం ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్ర నిడివి ఎంత అనే విషయం గురించి క్లారిటీ ఇచ్చారు.

"""/" / ఈ క్రమంలోనే రామ్ చరణ్ ఆచార్య సినిమాలో 40 నిమిషాల పాటు కనిపించనున్నారు.

ఈ నలభై నిమిషాలు సినిమాకి ఆద్యంతం కీలకంగా మారనుంది.ఇలా ఒకే తెరపై తండ్రీ కొడుకులు ఎక్కువ నిడివి ఉన్న సినిమాలలో కనిపించడం ఇదే మొదటిసారి.

ఇకపోతే ఈ సినిమాలో మెగాస్టార్ సరసన కాజల్ అగర్వాల్ నటించగా రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది.

ఈ సినిమా ఫిబ్రవరి 4వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

యూఎస్ బైకర్లతో ఇండియన్ టూరిస్ట్‌ల ఫ్రెండ్లీ ఇంట్రాక్షన్ వైరల్..