ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న సుధీర్…అమ్మాయి ఎవరంటే..?
TeluguStop.com
బుల్లి తెర హీరోగా పేరు తెచ్చుకున్న నటుడు సుడిగాలి సుధీర్( Sudigali Sudheer ) ఈటీవీ లో వచ్చిన జబర్దస్తు షో( Jabardasth Show ) ద్వారా పాపులర్ అయినా సుధీర్ ఆ తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి షో కి యాంకర్ గా కూడా చేసాడు.
సాఫ్ట్ వేరు సుధీర్ సినిమాతో హీరోగా వెండితెర కి పరిచయం అయినా సుధీర్ ఆ తరవాత వచ్చిన గాలోడు సినిమాతో( Galodu Movie ) మంచి మాస్ హిట్ ని సొంతం చేసుకున్నాడు జబర్దస్తు షో కంటే ముందు మ్యాజిక్ షో చేసుకునేవాడు సుధీర్, ఆ తర్వాత జబర్దస్తు షో తో ఒక్కసారిగా టాప్ లోకి వెళ్ళిపోయాడు.
"""/" /
ఎప్పటి నుంచో నడుస్తున్న టాపిక్ ఏంటంటే సుధీర్ పెళ్ళి( Sudheer Marriage ) ఎప్పుడు అని, జబర్దస్తు లో ఉన్నప్పుడు సుధీర్ రేష్మి పెళ్లి చేసుకుంటున్నారు అనే టాక్ నడించింది కానీ అది జస్ట్ షో వరకు మాత్రమే పరిమితం అని తెలుస్తుంది.
ఇప్పుడు సుధీర్ వరస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ మళ్ళి పెళ్లి ప్రస్తావన వచ్చింది.
సుధీర్ కి పెళ్లి కాకుండానే వాళ్ళ తమ్ముడికి పెళ్లి అయిపొయింది 35 సంవత్సరాలు వచ్చిన ఇంకా పెళ్లి చేసుకోకపోవడం తో ఇంట్లో పేరెంట్స్ పెళ్లి చేసుకోవాలని పదే పదే చెప్పడం తో ఇక కాదనలేక మొత్తానికి పెళ్లి చేసుకోవడానికి సిద్ధం అయ్యాడట.
"""/" /
అయితే అమ్మాయి ఎవరు అనేది ఇంకా తేలాల్సి ఉంది ప్రస్తుతం తెలుస్తున్న సమాచారం ప్రకారం సుధీర్ వాళ్ళ రిలేషన్స్ లో ఒక అమ్మాయి ని పెళ్లి చేసుకోబోతున్నట్టు తెలుస్తుంది.
పెళ్లి ఎప్పుడు ఆ అమ్మాయి ఎవరు అనేది ఎక్కడ తెలియకుండా జాగ్రత్త పడుతున్నట్టు తెలుస్తుంది.
ఈ న్యూస్ నిజం అయితే సుధీర్ ఫ్యాన్స్ చాలా ఆనంద పడుతారనే చెప్పాలి.
ఇక సుధీర్ ప్రస్తుతం ఒక పెద్ద బ్యానర్ లో సినిమా చేస్తున్నట్టు గా తెలుస్తుంది.
కరివేపాకు గాళ్లు మీకే అంతుంటే బన్నీకి బలుపు ఉండడం తప్పులేదు: మాధవీ లత