BJP TDP : ఏపీలో బీజేపీతో టీడీపీ పొత్తుపై రానున్న స్పష్టత..!

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ పార్టీల్లో సీట్ల వ్యవహారం కీలకంగా మారిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే బీజేపీతో( BJP ) టీడీపీ( TDP ) పొత్తుపై ఒకటి రెండు రోజుల్లో స్పష్టత రానుంది.

ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu ) ఢిల్లీకి వెళ్లనున్నారు.

ఈ పర్యటనలో భాగంగా బీజేపీ అగ్రనేతలు అమిత్ షా,( Amit Shah ) జేపీ నడ్డాతో( JP Nadda ) చంద్రబాబు సమావేశం కానున్నారు.

రాష్ట్రంలో పొత్తు వ్యవహారంపై బీజేపీ పెద్దలతో ఆయన కీలక చర్చలు నిర్వహించనున్నారని తెలుస్తోంది.

"""/" / అలాగే చంద్రబాబు పర్యటన తరువాత జనసేన అధినేత పవన్ కల్యాణ్( Pawan Kalyan ) ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది.

ఇరువురి ఢిల్లీ పర్యటన అనంతరం చంద్రబాబు, పవన్ కల్యాణ్ మరోసారి భేటీ కానున్నారని పార్టీ వర్గాలు వెల్లడించినట్లు సమాచారం.

కాగా రాష్ట్రంలో బీజేపీ పది అసెంబ్లీ, ఏడు లోక్ సభ స్థానాలను ఆశిస్తుంది.

ఈ నేపథ్యంలో బీజేపీతో టీడీపీ పొత్తుపై ఒకటి రెండు రోజుల్లో స్పష్టత రానుంది.

రాజాసాబ్ సినిమాలో నాని ఉన్నాడా..? ఈ క్యారెక్టర్ లో కనిపిస్తాడు..?