ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పై నేడు స్పష్టత..!!
TeluguStop.com
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్( Arvind Kejriwal ) మధ్యంతర బెయిల్ పై ఇవాళ స్పష్టత రానుంది.
లిక్కర్ కేసులో కేజ్రీవాల్ కు బెయిల్ ఇవ్వాలా? లేదా? అన్న విషయాన్ని సుప్రీంకోర్టు తేల్చనుంది.
ఈ మేరకు కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పిటిషన్ పై సుప్రీం ధర్మాసనం ఇవాళ తీర్పును వెలువరించనుంది.
కాగా ఈ పిటిషన్ పై ఇప్పటికే ఇరు పక్షాల వాదనలు ముగిశాయి.ఇందులో భాగంగా సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ చట్ట విరుద్ధంగా జరిగిందని ఆయన తరపున న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు.
ఎన్నికల ప్రక్రియకు దూరం చేసేలా ఈడీ( ED ) అరెస్ట్ జరిగిందని పేర్కొంది.
అలాగే షరతులతోనైనా మధ్యంతర బెయిల్ ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరారు.ఈ క్రమంలోనే ఎన్నికలు ఉండడంతో మధ్యంతర బెయిల్ అంశాన్ని పరిశీలిస్తామని ధర్మాసనం తెలిపింది.
అయితే కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ ఇవ్వాలన్న వినతిని ఈడీ వ్యతిరేకించింది.లిక్కర్ కేసులో కేజ్రీవాల్ కింగ్ పిన్ అని ఆరోపిస్తున్న ఈడీ ఆయనకు మధ్యంతర బెయిల్ ఇవ్వడం సరికాదని అఫిడవిట్ దాఖలు చేశారు.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్13, శుక్రవారం 2024