హైదరాబాద్ లో రోడ్డెక్కనున్న సిటీ బస్సులు..!

హైదరాబాద్ లో రోడ్డెక్కనున్న సిటీ బస్సులు!

కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా ప్రభుత్వం అన్ని సేవలను నిలిపివేసింది.అన్ లాక్ ప్రక్రియ కొనసాగుతుండటంతో ఈ నెల 7వ తేదీన ప్రభుత్వం నగరంలో మెట్రో సేవలు ప్రారంభించింది.

హైదరాబాద్ లో రోడ్డెక్కనున్న సిటీ బస్సులు!

తిరిగి ఇప్పుడు నగరంలో సిటీ బస్సులను నడపనున్నట్లు సమాచారం.త్వరలో హైదరాబాద్ సిటీ బస్సులు రోడ్డెక్కనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

హైదరాబాద్ లో రోడ్డెక్కనున్న సిటీ బస్సులు!

నగరంలో ఆర్టీసీ సిటీ సర్వీసు బస్సుల పునరుద్ధరణపై ఇప్పటికే ప్రణాళికలు కూడా సిద్ధం చేయనున్నారు.

ఇటీవల మహారాష్ట్ర, కర్ణాటక, చెన్నై రాష్ట్రాల్లో ఆర్టీసీ సర్వీసులు ప్రారంభం కావడంతో తెలంగాణ ఆర్టీసీ అధికారులు ఆయా రాష్ట్రాల్లో తీసుకుంటున్న జాగ్రత్త చర్యలు, బస్సుల అమలు తీరుపై అధ్యయనం చేశారు.

తెలంగాణ సిటీ ఆర్టీసీ నగరంలో మొదటగా 50 శాతం బస్సులను నడిపేందుకు నిర్ణయం తీసుకోనుంది.

రద్దీ ఎక్కువగా ఉండే 7 ప్రాంత రూట్లలో ఈ బస్సులను నడుపనున్నారు.దీనికి సంబంధించి ఆర్టీసీ ప్రభుత్వాన్ని ప్రతిపాదించింది.

ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే ఈ నెలాఖరులోగా సిటీ బస్సులు రోడ్డెక్కనున్నాయి.

ఇటీవల ఏపీలోని విజయవాడ, విశాఖపట్నంలో ఆర్టీసీ సిటీ బస్సులు ప్రారంభమయ్యాయి.మొదటిరోజు వంద బస్సులు ఆయా నగర రూట్లలో నడిచాయి.

బస్సుల్లో స్టాడింగ్ అనుమతి లేకుండా, కరోనా నిబంధనలు కఠినంగా అమలు చేస్తోంది.ప్రతి బస్టాప్ వద్ద ప్రయాణికుల ఆరోగ్య పరిస్థితి చెక్ చేస్తున్నారు.

ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించేలా.సామాజికదూరం పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు.

ఎన్టీఆర్ సినిమాలలో హృతిక్ రోషన్ కు ఆ సినిమా అంటే అంత ఇష్టమా…అలా ఫీలయ్యారా?