సిఐటియు ఆధ్వర్యంలో వేములవాడ నుండి కలెక్టరేట్ వరకు పాదయాత్ర

రాజన్న సిరిసిల్ల జిల్లా : ఏప్రిల్ 6 నుండి 14 వరకు సిఐటియు తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం ,మనువాదన్ని మట్టి పెడదాం , మతోన్మాద శక్తులను ప్రతిగటిద్దాం , కార్మిక వర్గ ఐక్యతను చాటుదాం అనే నినాదాలతో చేపడుతున్న సామాజిక న్యాయ వారోత్సవాలలో భాగంగా గురువారం ఏప్రిల్ 13వ.

తేదీ వాక్ ఫర్ సోషల్ జస్టిస్ ( సామాజిక న్యాయం కోసం పాదయాత్ర ) సిఐటియు రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వేములవాడ నంది కమాన్ నుండి కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేపట్టి కలెక్టర్ ఆఫీస్ లో వినతిపత్రాన్ని అందించడం జరిగింది.

ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎగమంటి ఎల్లారెడ్డి , ఉపాధ్యక్షులు మూషం రమేష్ లు మాట్లాడుతూ దేశంలో దళితులు , గిరిజనులు , మహిళలు , మైనారిటీలపై దాడులు అత్యాచారాలు కుల దురంకార హత్యలు కుల వివక్షతలు పెరుగుతున్నాయన్నారు.

కేంద్ర బిజెపి ప్రభుత్వం పేరుతో దేశభక్తి ముసుగులో ప్రజలు కార్మికుల్లో చిచ్చు పెడుతుందని జాతీయ వనరులను ప్రభుత్వ రంగ సంస్థలను కారు చకోగా కార్పొరేట్లకు అప్పజెప్పితో ప్రభుత్వ రంగాన్ని మొత్తం ప్రైవేటుపరం చేస్తుందని బడుగు బలహీన వర్గాలకు రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లకు గండి కొడుతున్నదని, నూతన విద్యా విధానం పేరుతో మనువాద సిద్ధాంతాన్ని విద్యా విధానంలోకి జోప్పించి అమలు చేయాలని చూస్తుందని కార్మికుల చట్టాలు హక్కులను కాలరాస్తూ దేశంలో రాజ్యాంగాన్ని కూనీ చేసే విధంగా ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ఈ విధానాలను ప్రతిఘటిస్తున్న ప్రజలను కార్మికులను ఐక్యం కాకుండా మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ పాలన కొనసాగిస్తున్నదన్నారు.

"""/" / కుల వివక్షత అణిచివేత దోపిడీలకు వ్యతిరేకంగా సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త క్యాంపెయిన్ చేయడం జరుగుతుందని అందులో భాగంగా ఈరోజు రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో సామాజిక న్యాయం కోసం వాక్ ఫర్ సోషల్ జస్టిస్ పేరుతో పాదయాత్రలు నిర్వహించడం జరుగుతుందన్నారు.

రాబోయే రోజుల్లో ఈ పాలకుల విధానాల నుండి భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవడం కోసం కార్మిక వర్గ ఐక్యతను చాటుతూ ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు మోర అజయ్ , అన్నల్ దాస్ గణేష్ , గురజాల శ్రీధర్ , సామల కవిత , ఒగ్గు గణేష్ , మాసం సురేష్ , సందెల తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

ఈ పాదయాత్రకు ఐద్వా జిల్లా కార్యదర్శి జవ్వాజి విమల , రైతు సంఘం జిల్లా కార్యదర్శి ముక్తికాంత అశోక్ గార్లు సంఘీభావం తెలిపి పాదయాత్రలో పాల్గొన్నారు.

మొదట్లో 3 సినిమాలు హిట్ అయ్యాయి…కట్ చేస్తే వరుస ప్లాపులు అందుకున్న హీరోలు వీళ్లే…