చిల్లర దొంగతనంతో పదికోట్ల ఉద్యోగం పోగొట్టుకున్నాడు

కొంత మందికి చిల్లర దొంగతనం అలవాటు ఉంటుంది.వారికి తెలియకుండానే, లేదంటే తెలిసి కూడా దానిని మానుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటారు.

ఎంత పెద్ద స్థానంలో ఉన్న కూడా చిల్ల దొంగతనం వలన ఒక్కోసారి ఇబ్బందుల్లో పడతారు.

పెద్ద పెద్ద ఉద్యోగాలని కూడా కోల్పోతారు.ఇప్పుడు అలాంటి పరిస్థితి ఒక వ్యక్తికి వచ్చింది.

పరాష్ షా అనే వ్యక్తి చిల్లర దొంగతనాలు అలవాటు వలన ఇప్పుడు ఏడాదికి పది కోట్లు సంపాదన వచ్చే ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వచ్చింది.

ఈ ఘటన యూరప్ లో చోటు చేసుకుంది.దీనికి సంబందించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

యూరప్‌లో బ్యాంకింగ్‌ లావాదేవీలతో అత్యధిక లాభాలు గడిస్తున్న ‘సిటీ గ్రూప్‌’ బ్యాంక్‌లో సీనియర్‌ మేనేజర్‌గా పనిచేస్తున్న పరాష్ షా పని చేస్తున్నాడు.

ఏటా దాదాపు తొమ్మిదన్నర కోట్ల రూపాయల జీతం అతను అందుకుంటున్నాడు.అయితే అతనులం డన్‌లోని కానరీ వార్ఫ్‌లో ఉన్న బ్యాంక్‌ ప్రధాన కార్యాలయం నుంచి తరచుగా శాండ్ విచ్ లు దొంగతనం చేస్తుననరనే అభియోగాలతో అతనిని ఉద్యోగం నుంచి తొలగించారు.

ఈ విషయాన్ని ఓ ఆంగ్ల పత్రిక ప్రచురించింది.లండన్‌లోని ఎడ్మాంటన్‌లో గ్రామర్‌ స్కూల్‌లో చదవిన షా, బాత్‌ యూనివర్శిటీలో 2010లో ఎకనామిక్స్‌లో డిగ్రీ చేశారు.

హెచ్‌ఎస్‌బీసీలో ఇన్‌కమ్‌ ట్రేడింగ్‌ బిజినెస్‌లో ఏడేళ్లు పనిచేసి 2017లో సిటీ గ్రూప్‌లో చేరారు.

ప్రస్తుతం యూరప్‌తోపాటు మధ్యప్రాచ్యం, ఆఫ్రికా బ్యాంకింగ్‌ కార్యకలాపాలకు హెడ్‌గా వ్యవహరిస్తున్నారు.అయితే ఇప్పుడు ఈ చిల్లరదొంగాతనంతో ఒక్కసారిగా వార్తలలో నిలిచాడు.

అయితే పరాష్ గతంలో కూడా తాను పని చేసిన కంపెనీలలో చిల్లర దొంగతనాలు చేస్తూ ఉద్యోగాలని పలు సందర్భాలలో పోగొట్టున్న ఘటనలు ఉన్నాయని తెలుస్తుంది.

వార్ 2 తో సక్సెస్ కొట్టకపోతే ఎన్టీయార్ బాలీవుడ్ మార్కెట్ పరిస్థితి ఏంటంటే..?