మళ్లీ తెరమీదకి సైఫర్ ఫోక్స్ ఐటీ సొల్యూషన్స్ మోసం

విశాఖలో సైఫర్ ఫోక్స్ ఐటీ సొల్యూషన్స్ చీటింగ్ వివాదం తెరపైకి వచ్చింది.దీంతో పీఎం పాలెం పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

నిరుద్యోగుల సాఫ్ట్ వేర్ జాబ్ కలను క్యాష్ గా మార్చేకునేందుకు మోసాలకు పాల్పడ్డారు.

ఈ క్రమంలో ఐటీ సొల్యూషన్స్ డైరెక్టర్ పూజితను పీఎం పాలెం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈమె, సీఈవో వర్మతో కలిసి సుమారు 6 వందల మందికి ఉద్యోగాల పేరిట కుచ్చుటోపీ పెట్టినట్లు గుర్తించారు.

ఈ నేపథ్యంలో తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ పోలీసుల వాహనం ముందు బాధితులు బైఠాయించి నిరసనకు దిగారు.

దీంతో స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది.