డయాబెటిస్‌కు చెక్ పెట్టే దాల్చిన చెక్క‌.. ఎలాగో తెలుసా?

డ‌యాబెటిస్ లేదా మధుమేహం.ఇటీవ‌ల కాలంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అనేక మందిని ప‌ట్టిపీడిస్తున్న ఆరోగ్య స‌మ‌స్య.

రక్తంలో అత్యధికంగా చక్కర శాతం ఉండటమే మ‌ధుమేహం.ఈ స‌మ‌స్య ఒక్క‌సారి వ‌చ్చిందంటే జీవిత‌కాలం ఉంటుంది.

అయితే రక్తంలో షుగ‌ర్ లెవ‌ల్స్‌ను త‌గ్గించ‌డంలో దాల్చిన చెక్క‌ గ్రేట్‌గా స‌హాయ‌ప‌డుతుంది.అందుకు దాల్చిన చెక్క‌ను తీసుకుని మెత్తగా పౌడ‌ర్ చేసుకోవాలి.

ఈ పౌడ‌ర్‌ను ప్ర‌తిరోజు ఉద‌యం గోరువెచ్చ‌ని నీటిలో క‌లుపుకుని తీసుకుంటే.మ‌ధుమేహం అదుపులో ఉంటుంది.

దాల్చిన చెక్క‌తో మ‌రిన్ని ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు కూడా ఉన్నాయి.అధిక బ‌రువుతో బాధ‌ప‌డేవారికి దాల్చిన చెక్క అద్భుతంగా ఉప‌యోగ‌ప‌డుతుంది.

ప్ర‌తిరోజు ఓ క‌ప్పు దాల్చిన చెక్ టీ తాగితే.శ‌రీరంలో ఉన్న అద‌న‌పు కొలెస్టరాల్ క‌రుగుతుంది.

త‌ద్వారా గుండె ఆరోగ్యం కూడా మెరుగుప‌డుతుంది.జలుబు, దగ్గుతో బాధ‌ప‌డేవారు వేడినీటిలో దాల్చిన చెక్క పౌడ‌ర్ మ‌రియు తేనె క‌లిపి తీసుకోవాలి.

రోజుకు ఒక‌సారి దీన్ని తీసుకుంటే సులువుగా ద‌గ్గు, జ‌లుబు త‌గ్గుముఖం ప‌డ‌తాయి. """/"/ మలబద్ధకం, జీర్ణ సంబంధ సమస్యలున్నవాళ్లు దాల్చిన చెక్క‌ను డైట్‌లో చేర్చుకుంటే చాలా మంచిదని అంటున్నారు ఆరోగ్య నిపుణుల‌.

ఇక దాల్చిన చెక్క మ‌రో ఉప‌యోగం ఏంటంటే.నోటి దుర్వాస‌న‌ను త‌గ్గిస్తుంది.

ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు దంత స‌మ‌స్య‌లు తొల‌గించి.నోటి దుర్వాస‌న‌కు చెక్ పెడుతుంది.

ఈ బాలుడు మృత్యుంజయుడా.. మూడో అంతస్తు నుంచి పడినా బతికే ఉన్నాడు.. వీడియో చూడండి!