కొరియోగ్రాఫర్లు, సినిమాటోగ్రాఫర్లు డైరెక్టర్లు అయ్యారు…
TeluguStop.com
ఇండస్ట్రీ లో కొంత మంది నటులు డైరెక్టర్లు గా మారుతుంటారు ఎందుకంటే ఇండస్ట్రీ లో ఎవరు ఏ క్రాఫ్ట్ లో ఉన్న కూడా అన్ని క్రాఫ్ట్ లకి పెద్ద డైరెక్టర్( Director ) ఒక్కడే కాబట్టి వాళ్ళు కూడా డైరెక్షన్ చేయాలి అని అనుకుంటారు.
అందుకే నటులు, మ్యూజిక్ డైరెక్టర్లు, కొరియోగ్రాఫర్లు, సినిమాటోగ్రాఫర్లు అందరూ ఇండస్ట్రీ లో డైరెక్టర్లు గా మారిపోయి చాలా వరకు మంచి సినిమాలు తీసే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు.
నిజానికి వీళ్ళందరూ చేసిన సినిమాలు మంచి హిట్లు సాధించినప్పటికీ వాళ్ల లో కొందరు మాత్రం లాంగ్ రన్ లో డైరెక్టర్లు గా కొనసాగడం లో ఫెయిల్ అవుతున్నారు.
"""/" /
అందులో ముఖ్యంగా అమ్మ రాజశేఖర్( Amma Rajasekhar ) లాంటి మాస్టర్ డైరెక్టర్ గా మారి చేసిన రణం సినిమా మంచి విజయాన్ని అందుకుంది ఇక ఆ తర్వాత ఆయన చేసిన ఆయన చేసిన అన్ని సినిమాలు ప్లాప్ అవ్వడంతో ఇప్పుడు ఆయన మళ్ళీ డైరెక్షన్ చేయడం లేదు.
ఇక ఈయన తర్వాత రాఘవ లారెన్స్( Raghava Lawrence ) కూడా డైరెక్టర్ అయ్యాడు కానీ ఆయన నటిస్తూ డైరెక్టర్ గా కూడా వ్యవహరిస్తున్నాడు.
ఇక కొరియోగ్రాఫర్ లలో టాప్ మోస్ట్ కొరియోగ్రాఫర్ అయిన ప్రభుదేవా మాస్టర్( Prabhudeva Master ) కూడా డైరెక్షన్ చేసి మంచి హిట్లు అందుకున్నాడు.
"""/" /
సినిమాటోగ్రాఫర్ గా ఉంటూ గోపిచంద్ తో శౌర్యం అనే సినిమా తీసి మంచి విజయాన్ని అందుకున్నాడు డైరెక్టర్ శివ.
( Director Siva ) ఇక దీని తర్వాత ఈయన తీసిన సినిమాలు అన్ని కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ప్లాప్ అవ్వడం తో ఈయన తమిళం లో అజిత్ హీరో గా వరుసగా సినిమాలు తీసి మంచి విజయాలను అందుకున్నాడు.
ప్రస్తుతం ఆయన తమిళం లో టాప్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్నాడు.నిజానికి ఈయన చేసిన అన్ని సినిమాలు తెలుగు లో ఓకే అనిపించుకున్నప్పటికి తమిళం లో మాత్రం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి అనే చెప్పాలి.
పావలా శ్యామలకు అండగా నిలిచిన పూరి కుమారుడు ఆకాష్…మంచి మనస్సు అంటూ?