ప్రముఖ సినిమాటోగ్రాఫర్ బి.కన్నన్ మృతి

ఈ మధ్య కాలంలో సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు ఒక్కొక్కరుగా మృతి చెందుతున్నారు.

ఈ మధ్య కాలంలోనే బాలీవుడ్ లో కొంత మంది ప్రముఖులు మృతి చెందారు.

ఇప్పుడు సౌత్ ఇండియలో ఒకప్పటి స్టార్ సినిమాటోగ్రాఫర్ బి.కన్నన్ అనారోగ్యంతో చెన్నైలో ఓ హాస్పిటల్ లో మృతి చెందారు.

గత కొన్ని రోజులుగా గుండెకు సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయనకు ఇటీవల ఆపరేషన్ చేశారు.

అయినా ఆయన ఆరోగ్యం మెరుగుపడలేదు.శనివారం ఆరోగ్యం పూర్తిగా క్షినించడంతో కన్నన్ మృతి చెందారు.

కన్నన్ ఒకప్పటి లెజండరీ డైరెక్టర్ భీమ్ సింగ్ కుమారుడు.అలాగే ప్రముఖ ఎడిటర్ బి.

లెనిన్ కు సోదరుడు.ఇతను తమిళంతో పాటు తెలుగు మలయాళ చిత్రాలకు కూడా కెమెరామెన్ గా పనిచేసారు.

తమిళ దర్శకుడు భారతీరాజాతో కలిసి దాదాపు 40 సినిమాలకి పనిచేశారు.అందుకే ఆయన్ను భారతీరాజా కళ్లు అని సౌత్ లో అందరూ పిలుస్తుంటారు.

నలభై ఏళ్లకు పైగా సినీ ఇండస్ట్రీకి సేవలు అందించిన కన్నన్ తెలుగులో పగడాల పడవ, కొత్త జీవితాలు, సీతాకోక చిలుక, చిరంజీవి ఆరాధన చిత్రాలకు సినిమాటోగ్రాఫర్ గా పని చేశారు.

ఆయన మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.సినీ నటి ఖుష్బూ ట్వీట్ చేస్తూ మరో గొప్ప వ్యక్తిని గొప్ప సినిమాటోగ్రాఫర్ ను కోల్పోయాం.

ఆయన కుటుంబ సభ్యులకు నా సానుభూతి తెలుపుతున్నా అని ఆయనతో గల అనుబంధాన్ని పంచుకున్నారు.

కెనడాలో పంజాబీ గ్యాంగ్‌స్టర్‌కు బిగుస్తోన్న ఉచ్చు .. భారత్‌కు రప్పించాలని కేంద్రం పావులు