టాలీవుడ్ లో దుమారం రేపుతున్న ప్రభుత్వ నిర్ణయం.. ఆ హీరోలకు షాక్ అంటూ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ టాలీవుడ్ స్టార్ హీరోలకు, స్టార్ ప్రొడ్యూసర్లకు, స్టార్ డైరెక్టర్లకు భారీ షాకిచ్చింది.

మంత్రి పేర్ని నాని ఈరోజు సినిమాటోగ్రఫీ చట్టానికి సవరణ బిల్లును శాసన సభలో ప్రవేశపెట్టారు.

సినిమా థియేటర్లలో నాలుగు ఆటలు మాత్రమే ప్రదర్శించకుండా ఇష్టానుసారం ఆరేడు ఆటలు ప్రదర్శిస్తున్నాయని బెనిఫిట్ షోల పేరుతో 500 రూపాయల నుంచి 1,000 రూపాయల వరకు వసూలు చేస్తున్నారని పేర్ని నాని పేర్కొన్నారు.

కొంతమంది చట్టం తమకు అనుకూలంగా ఉందని భావిస్తుంటే మరికొందరు ఏ చట్టం మమ్మల్ని ఆపట్లేదని ధీమా వ్యక్తం చేస్తున్నారని పేర్ని నాని చెప్పుకొచ్చారు.

ఆన్ లైన్ టికెట్ ప్రక్రియ ద్వారా సినిమా థియేటర్లలో జరిగే వ్యవహారాలను అడ్డుకట్ట వేయవచ్చని పేర్ని నాని అన్నారు.

ఇకపై ఇంటినుంచే ఆన్ లైన్ లో సినిమా టికెట్లను కొనుగోలు చేయవచ్చని పేర్ని నాని కామెంట్లు చేశారు.

ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆన్ లైన్ పోర్టల్ ను నిర్వహిస్తుందని పేర్ని నాని చెప్పుకొచ్చారు.

ఆర్బీఐ గేట్ వే ద్వారా సినిమా థియేటర్లకు చెల్లింపులు జరుపుతామని పేర్ని నాని అన్నారు.

"""/" / అయితే ప్రభుత్వ నిర్ణయం గురించి సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది.

మరికొన్ని రోజుల్లో పెద్ద సినిమాలు రిలీజ్ కానుండగా అఖండ, ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్, భీమ్లా నాయక్ మేకర్స్, ఆయా సినిమాల్లో నటించిన హీరోలకు ప్రభుత్వ నిర్ణయం భారీ షాక్ అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

"""/" / టాలీవుడ్ పెద్దలు, నిర్మాతలు ప్రభుత్వ నిర్ణయం గురించి ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

కరోనా వల్ల భారీ మొత్తంలో నష్టపోయిన సినిమా రంగానికి చెందిన వాళ్లకు ఏపీ ప్రభుత్వ నిర్ణయం పెద్ద షాక్ అని చెప్పాలి.

ఏపీ సర్కార్ నిర్ణయం వల్ల టాలీవుడ్ స్టార్ హీరోలు రెమ్యునరేషన్లను తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడనుంది.

Chandrababu : కదిరి ప్రజాగళం సభలో చంద్రబాబు సీరియస్ వ్యాఖ్యలు..!!