మమతా సర్కార్ కీలక నిర్ణయం…అక్టోబర్ 1 నుంచి తెరుచుకోనున్న…!
TeluguStop.com

కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే.ఈ మహమ్మారికి ఈ రంగం ఆ రంగం అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఆర్ధికంగా కుంగిపోయారు.


దీనితో దేశ ఆర్ధిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతినింది కూడా.మరి ముఖ్యంగా సినిమా రంగంలో దీని ప్రభావం బాగా ఎక్కువగా ఉందని చెప్పాలి.


ఈ కరోనా లాక్ డౌన్ సమయంలో సినీ రంగం ఎదురుకొంటున్న ఒడిదుడుకులు అంతా ఇంతా కాదు.
వరుసగా సినీ ప్రముఖులు మరణించడం తో పాటు పలు అనుకోని ఘటనలు చోటుచేసుకోవడం తో చాలా ఇబ్బందులు పడుతుంది.
ఒకపక్క సినిమా థియేటర్స్ తెరుచుకోకపోవడం సినీ పరిశ్రమను మరింత కుంగదీస్తుంది.ఇలాంటి సమయంలో పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.
కరోనా కారణంగా మూసివేసిన సినిమా థియేటర్స్ ను ఓపెన్ చేయాలి అంటూ నిర్ణయం తీసుకుంది.
అక్టోబర్ 1 నుంచి సినిమా హాళ్లు,ఓపెన్ ఎయిర్ థియేటర్లు పశ్చిమ బెంగాల్ లో తిరిగి తెరుచుకోనున్నాయి.
50 మంది అంతకంటే తక్కువ మందితో వీటిని నిర్వహించుకునేందుకు అనుమతిస్తున్నట్లు ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ తెలిపారు.
అయితే ప్రతి ఒక్కరూ కూడా భౌతిక దూరం, మాస్కులు ధరించడం వంటి కరోనా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఆమె ఈ సందర్భంగా స్పష్టం చేసినట్లు తెలుస్తుంది.
అంతేకాకుండా వచ్చే నెల నుంచి మ్యూజిక్ షోలు, డ్యాన్సింగ్ ఈవెంట్స్, మ్యాజిక్ షోలు వంటి కార్యక్రమాలకు కూడా అనుమతి ఇస్తామని మమతా తెలిపినట్లు సమాచారం.
కరోనా కారణంగా గత కొద్దీ నెలలుగా సినిమా షూటింగ్స్,థియేటర్లు బంద్ అయిన విషయం తెలిసిందే.
అయితే ఇటీవలే సినిమా షూటింగ్ లను నిర్వహించుకోవచ్చు అంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతులను ఇవ్వగా ఇప్పుడిప్పుడే సినిమా షూటింగ్ లు ప్రారంభం అయ్యాయి.
ఇప్పుడు పశ్చిమ బెంగాల్ సర్కార్ థియేటర్స్ ను ఓపెన్ చేస్తూ మమతా సర్కార్ కీలక నిర్ణయం తీసుకోవడం మరింత ఆనందం కలిగిస్తుంది సినీ ప్రియులకు.
రామ్ చరణ్ పెద్ది మూవీ.. శివరాజ్ కుమార్ చేసిన ఈ పనికి ఫిదా అవ్వాల్సిందే!