పీకల్లోతు ప్రేమలో ఉన్నా పెళ్లికి దూరంగా ఉన్న సెలబ్రిటీలు వీళ్లే?

సినిమా రంగానికి చెందిన హీరోలు, హీరోయిన్లు తమకు క్రేజ్ ఎక్కువగా ఉన్న సమయంలోనే వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేయాలని భావిస్తారు.

ఆ కారణం వల్లే ప్రేమలో ఉన్నా పెళ్లి చేసుకోవడానికి చాలామంది హీరోలు, హీరోయిన్లు ఎక్కువగా ఆసక్తి చూపడం లేదు.

స్టార్ హీరోలతో పోలిస్తే హీరోయిన్ల లైఫ్ స్పాన్ తక్కువ కావడంతో కొంతమంది హీరోయిన్లు ఆఫర్లు తగ్గిన తర్వాతే పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు.

మరి కొందరు హీరోయిన్లు మాత్రం సినిమాల్లో ఆఫర్లు తగ్గుతాయని పెళ్లికి దూరంగా ఉన్నారు.

జాకీ భగ్నానీతో ప్రేమలో ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం పెళ్లి గురించి ఆలోచించే తీరిక తనకు లేదని కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే.

ఎప్పుడు పెళ్లి చేసుకోవాలని అనిపిస్తే అప్పుడే పెళ్లి చేసుకుంటానని రకుల్ ప్రీత్ సింగ్ చెప్పుకొచ్చారు.

మరోవైపు వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్ శృతిహాసన్ బిజీగా ఉన్నారనే సంగతి తెలిసిందే.

శంతనుతో ప్రేమలో ఉన్న శృతిహాసన్ ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ప్రేక్షకులకు శంతనుతో రిలేషన్ షిప్ గురించి క్లారిటీ ఇచ్చేశారు.

"""/"/ అయితే పెళ్లి మాత్రం ఇప్పుడే చేసుకోనని శృతి చెబుతున్నారు.ప్రస్తుతం ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సలార్, బాలయ్య గోపీచంద్ మలినేని కాంబో సినిమాలతో శృతిహాసన్ బిజీగా ఉన్నారు.

మరో స్టార్ హీరోయిన్ నయనతార విఘ్నేష్ శివన్ తో పీకల్లోతు ప్రేమలో ఉన్నారు.

"""/"/ కెరీర్ పరంగా వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న నయనతార పెళ్లి ఎప్పుడు చేసుకుంటారనే ప్రశ్నకు సమాధానం చెప్పడం లేదు.

మరో స్టార్ హీరోయిన్ తాప్సీ బ్యాడ్మింటన్ కోచ్ అయిన మథయాస్ బోతో రిలేషన్ లో ఉన్నారు.

సంవత్సరానికి రెండు సినిమా ఛాన్సులు రాని పక్షంలో పెళ్లి గురించి ఆలోచిస్తానని ఆమె పేర్కొన్నారు.

మరో హీరోయిన్ అలియా భట్ సైతం రణబీర్ కపూర్ తో పెళ్లికి సంబంధించి ఎటువంటి క్లారిటీ ఇవ్వడం లేదు.

ఏపీ ఎన్నికలపై ఎన్డీ టీవీ సర్వే.. మరోసారి వైఎస్ఆర్‎సీపీదే విజయం..!