సీఎం రిలీఫ్ ఫండ్ స్కాంపై సీఐడీ కేసు నమోదు

తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కుంభకోణంపై సీఐడీ కేసు నమోదు చేసింది.తప్పుడు బిల్లులు, నకిలీ ఆధార్, ధృవపత్రాలతో స్కామ్ చేసినట్లు అధికారులు గుర్తించారు.

కాగా ఈ కుంభకోణంలో ఆస్పత్రి సిబ్బందితో పాటు పలువురు ప్రజా ప్రతినిధుల పాత్ర ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

అయితే రాష్ట్ర వ్యాప్తంగా వరుసగా కేసులు నమోదు కావడంతో కేసు విచారణ సీఐడీకి బదిలీ అయిందని తెలుస్తోంది.

సైఫాబాద్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు కాగా ఈ స్కాంలో ఇప్పటికే నలుగురిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

ఆమె ఓ అందాల సితార… భారతీయ తెరపై ఆమె గీసిన ‘రేఖ’ చెరిగిపోదు ఎప్పటికీ!