నారా లోకేశ్ పై ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్..!

టీడీపీ నేత నారా లోకేశ్ పై విజయవాడలోని ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది.

విశాఖ సభలో లోకేశ్ వ్యాఖ్యలు అధికారులను భయభ్రాంతులకు గురి చేసేలా ఉన్నాయని సీఐడీ పిటిషన్ లో పేర్కొంది.

ఈ క్రమంలోనే తనకు వ్యతిరేకంగా వ్యవహరించిన అధికారుల పేర్లు, రెడ్ డైరీలో రాసుకున్నానని లోకేశ్ వ్యాఖ్యలు చేశారని సీఐడీ పిటిషన్ లో తెలిపింది.

లోకేశ్ వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని ఏసీబీ కోర్టును సీఐడీ కోరింది.అయితే యువగళం పాదయాత్ర ముగింపు సభ నేపథ్యంలో పోలేపల్లిలో నిర్వహించిన యువగళం - నవశకం పేరుతో లోకేశ్ సభ జరిగిన సంగతి తెలిసిందే.

వైరల్ వీడియో: నీకు హాట్సాఫ్ గురూ.. ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నావుగా