ఏపీలో డ్యూటీ చేస్తూ ఉండగా గుండెపోటుతో మరణించిన సీఐ..!!

దేశవ్యాప్తంగా గుండెపోటు( Heart Attack ) మరణాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి.వయసుతో సంబంధం లేకుండా చాలామంది గుండెపోటుకు గురవుతున్నారు.

ఒకప్పుడు పెద్ద వయసు కలిగిన వారు గుండెపోటుకు గురయ్యేవారు.కానీ ఇప్పుడు స్కూల్ మరియు కాలేజీ ఇంకా మధ్య వయసులో ఉన్నవారు కూడా గుండెపోటుకీ గురై చనిపోతున్నారు.

సామాన్యులు మొదలుకొని సినిమా సెలబ్రిటీల వరకు చాలామంది గుండెపోటుతో మరణిస్తున్నారు.జిమ్ చేస్తున్న వాళ్లు సైతం గుండెపోటుకు గురవుతున్నారు.

"""/" / మహమ్మారి కరోనా ప్రభావం తగ్గిన తర్వాత దేశంలో మనిషి ఆరోగ్యంలో చాలా మార్పులు సంభవిస్తున్నాయి.

ఈ క్రమంలో అత్యధికంగా గుండెపోటు రావటం చాలామందికి కలవరాన్ని పుట్టిస్తూ ఉంది.తాజాగా ఆంధ్ర ప్రదేశ్( Andhra Pradesh ) రాష్ట్రంలో డ్యూటీలో ఉన్న సీఐ గుండెపోటుకు గురై ప్రాణాలు విడిచారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే నెల్లూరు జిల్లా ఆత్మకూరు సీఐ నాగేశ్వరరావు(46)( CI Nageswara Rao ) గుండెపోటుతో మరణించడం జరిగింది.

డ్యూటీ చేస్తుండగానే గుండెపోటు రావడంతో వెంటనే హుటాహుటిన సిబ్బంది ఆయనని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.

సత్తు పొడి అంటే ఏమిటి.. దానితో ఎలాంటి ఆరోగ్య లాభాలు పొందొచ్చు..?