చౌమహల్లా ప్యాలెస్.. 4 ప్యాలెస్ ల సముదాయం..!

ప్రముఖ సందర్శక ప్రదేశం చౌమహల్లా ప్యాలెస్ తిరిగి ప్రారంభం కానుంది.కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా మూసివేసిన ఈ ప్యాలెస్ ను ప్రభుత్వం అక్టోబర్ 3వ తేదీ నుంచి అందుబాటులోకి తీసుకురానుంది.

చౌమహల్లా ప్యాలెన్ తిరిగి ప్రారంభం కానుండటంతో ఇప్పటికే ప్యాలెస్ లో కరోనా జాగ్రత్తలకు సంబంధించి అన్ని ఏర్పాటు చేసినట్లు, కరోనా నిబంధనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉంటామని చౌమహల్లా ప్యాలెస్ ట్రస్ట్ డైరెక్టర్ కిషన్ రావు తెలిపారు.

ఇప్పటికే ప్యాలెస్ లో శానిటైజర్ స్టాండ్ లను ఏర్పాటు చేసినట్లు, సందర్శకులు సామాజిక దూరం పాటించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు.

ప్యాలెస్ కు వచ్చే సందర్శకులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచించారు.h3 Class=subheader-styleచౌమహల్లా ప్యాలెస్ ప్రత్యేకతలు.

/h3p చౌమహల్లా ప్యాలెస్ 4 ప్యాలెస్ ల సముదాయం.నిజాం కాలంలో వినియోగించిన మంచాలు, దుస్తులు, ఫర్నిచర్, ఫోటోలు, పురాతన వస్తువులన్నింటిని భద్రపరిచారు.

ఈ ప్యాలెస్ ను రెండో నిజాం కాలంలో చార్మినార్ లోని లాడ్ బజార్ కు సమీపంలో నిర్మించారు.

అసఫ్ జాహీల రాచరిక పాలనకు నిలువుటద్దంగా ఈ ప్యాలెస్ కనిపిస్తుంది.ఈ ప్యాలెస్ ను దాదాపు 2.

90 లక్షల గజాల విస్తీర్ణంలో నిర్మించారు.ఆ కాలంలో విద్యుత్ లైట్లు లేని కారణంగా వెలుగు కోసం షాండిలియర్లను ఏర్పాటు చేశారు.

H3 Class=subheader-style ప్యాలెస్ సందర్శన వేళలు./h3p చార్మినార్ కట్టడం నుంచి లాడ్ బజార్, ఖిల్వత్ చౌరస్తా దాటి ముందుకు వెళితే చౌమహల్ ప్యాలెస్ వస్తుంది.

అక్టోబర్ 3వ తేదీ నుంచి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సందర్శించుకోవచ్చు.

శుక్రవారం మాత్రం సెలవుదినంగా ప్రకటించారు.ప్యాలెస్ ఎంట్రీ అవ్వడానికి చిన్నారులకు రూ.

20, పెద్దలకు రూ.60, విదేశీయులకు రూ.

200ల ఎంట్రీ ఫీజు నిర్ణయించారు.

మెగా ఫ్యామిలీ టార్గెట్ గా  ‘ ముద్రగడ ‘ సంచలన వ్యాఖ్యలు