పుష్ప పాటకు స్టెప్పులు ఇరగదీసిన మరో ఎమ్మెల్యే..!

ఇప్పుడు ఎక్కడ చూసినాగాని పుష్ప సినిమాలోని డైలాగ్స్, పాటలు బాగా వైరల్ అవుతున్నాయి.

చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు పుష్ప సినిమాలోని పాటలకు తమదైన శైలిలో స్టెప్స్ వేస్తూ అందరిని అలరిస్తున్నారు.

పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటున్నావా.ఫైర్.

నీ యవ్వ తగ్గేదేలే.అని పుష్ప మానరిజంను ఫాలో అవుతున్నారు.

అలాగే పుష్ప సినిమాలోని నా సామీ పాట, ఊ అంటావా మామ.ఉహు అంటావా.

అనే పాట కూడా బాగా వైరల్ అయ్యాయి.ఏ ఫంక్షన్ అయినా పుష్ప సాంగ్స్ తోనే మొదలు అవుతున్నాయి.

మరొక విశేషం ఏంటంటే నిరసనలు ప్రదర్శించాలన్నాగాని పుష్ప పాటలే వినిపిస్తున్నాయి.ఈ క్రమంలోనే రాజకీయ నాయకులు కూడా పుష్ప సాంగ్స్ కి బాగా కనెక్ట్ అయిపోయి కాలు కదిపేస్తున్నారు.

తమలోని కళాకారులను నిద్రలేపుతున్నారు.తాజాగా అధికార పార్టీ ఎమ్మెల్యే కూడా పుష్ప సినిమాలోని పాటలకు డాన్సులు వేశారు.

ఆ ఎమ్మెల్యే మరెవరో కాదు కరణం ధర్మశ్రీ.ఆయనలో మంచి కళాకారుడు ఉన్నాడు.

ఆయన పద్యాలు, పాటలు ఎంతో బాగా పాడతారు.అలాగే కవితలు సైతం అలవోకగా అల్లుతారు.

మరి అలాంటి ఆయన ఊ అంటావా మావ.ఉహు అంటావా.

అనే మంచి ఊపు ఉన్న బీట్ ప్లే అవుతుంటే కాలు కదపకుండా ఉండగలరా చెప్పండి.

సై అని చెప్పి మరీ ఒక రేంజ్ లో డ్యాన్స్ వేసి అదరగొట్టేశారు.

"""/"/ వివరాల్లోకి వెళితే.విశాఖ జిల్లాలో జరిగిన ఒక కార్యక్రమంలో ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ పాల్గొన్నారు.

ఆయన ఆ ఫంక్షన్ లో ఊ అంటావా మావా.ఉహూ అంటావా.

అనే పాటకు స్టెప్స్ వేశారు.ఆయన డాన్స్ వేయడం చూసి ఆయనతో పాటు మొత్తం పార్టీ నాయకులు కూడా ఎంతో జోష్ గా డాన్సులు వేసి హుషారెత్తించారు.

అంతా కలసి ఒకటే సందడి చేస్తూ అక్కడ సంబరాలే చేశారు.ఒక చేత్తో కర్చీఫ్ పట్టుకుని పైకి ఊపుతూ ఎమ్మెల్యే ధర్మశ్రీ చేసిన డ్యాన్స్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మంచి కళాకారుడు అనే విషయాన్నీ మరోసారి నిరూపించుకున్నారు.

వేసవిలో అజీర్తి, గ్యాస్ సమస్యలు అధికంగా ఇబ్బంది పెడుతున్నాయా.. అయితే ఈ టిప్స్ మీకోసమే!