వయనాడ్ బాధితుల విషయంలో మంచి మనస్సు చాటుకున్న విక్రమ్.. అన్ని రూ.లక్షల విరాళమంటూ?
TeluguStop.com
ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా కేరళలోని వయనాడు జిల్లా( Wayanad ) గురించి చర్చించుకుంటున్నారు.
అక్కడి పరిస్థితులు తెలిసిన ప్రతి ఒక్కరూ పాపం అనకుండా ఉండలేకపోతున్నారు.ఇంకా చెప్పాలి అంటే ప్రకృతి కేరళ పై( Kerala ) పగ పట్టిందని చెప్పాలి.
మొన్నటికి మొన్న భారీ వర్షాలతో వరదలు పోటెత్తి కేరళను అతలాకుతలం చేశాయి.దాని నుంచి ఇంకా కోలుకోక ముందే మరోసారి కేరళ పై భాగా పట్టింది ప్రకృతి.
వయనాడ్ జిల్లాలోని చాలా ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడడంతో దాదాపుగా 150 మందికి పైగానే మృతి చెందారు.
అలాగే వందలాది మంది తీవ్రంగా గాయపడ్డారు.శిథిలాల కింద చాలామంది ఇరుక్కుపోయారని, మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.
"""/" /
అయితే రోజు రోజుకి మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది తప్ప తగ్గడం లేదు.
దీంతో ఆ శిథిలాల కింద ఇంకా ఎంతమంది ఉన్నారో అంచనా వేయడం కూడా అధికారులకు స్పష్టంగా మారింది.
ఈ దారుణమైన విషాద ఘటన దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరిని దిగ్భ్రాంతికి గురి చేసింది.
ప్రధాని నరేంద్ర మోడీతో సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.ఈ నేపథ్యంలో కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్( Chiyaan Vikram ) కేరళ ప్రకృతి విలయతాండవం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
వయనాడ్ లో కొండచరియలు విరిగిపడి 150 మందికి పైగా చనిపోవడం పట్ల ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో మృతుల కుటుంబాలు, బాధితుల సహాయార్థం కేరళ ముఖ్యమంత్రి సహాయన నిధికి విక్రమ్ రూ.
20 లక్షల విరాళంగా ఇచ్చారు. """/" /
ఈ విషయాన్ని విక్రమ్ మేనేజర్ యువరాజ్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు.
కేరళలోని వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడటం వల్ల 150 మందికి పైగా చనిపోయారు.
అలాగే 197 మంది గాయపడ్డారు.మరెంతో మంది ఆచూకీ లేకుండా తప్పిపోయారు.
ఎంతో మంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు తెలుస్తోంది.ఈ ఘటన పట్ల నటుడు చియాన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
బాధితుల సహాయార్థం కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.20 లక్షలు విరాళంగా ఇచ్చారు అని తన పోస్టులో రాసుకొచ్చారు విక్రమ్ మేనేజర్.
అయితే ఇందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో విక్రంపై అభిమానులు ప్రశంశల వర్షం కురిపిస్తున్నారు.
ఇంకా చాలామంది సెలబ్రిటీలు ముందుకు వచ్చి వారికి విరాళాలు ఇస్తే చాలా మంచిదని చాలామంది అభిప్రాయాలు కూడా వ్యక్తం చేస్తున్నారు.
కన్నప్ప సక్సెస్ అయితే క్రెడిట్ ఎవరికి వెళ్తుంది..?