నో రీమేక్స్.. ఇక మెగాస్టార్ నుండి అన్ని స్ట్రైట్ సినిమాలే?
TeluguStop.com
టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి ( Mega Star Chiranjeevi ) సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఎక్కువ శాతం రీమేక్ సినిమాలనే చేస్తూ వస్తున్నాడు.
స్ట్రైట్ సినిమాలు చేసింది తక్కువ అనే చెప్పాలి.కానీ ప్రేక్షకులు మెగాస్టార్ నుండి రీమేక్ సినిమాలను ఆశించడం లేదు.
ఎందుకంటే ఓటిటీ ప్లాట్ ఫామ్ లు వచ్చిన తర్వాత ప్రేక్షకులు అన్ని బాషల సినిమాలను ఓటిటి లోనే వీక్షిస్తున్నారు.
దీంతో ఒరిజినల్ సినిమా చూసిన ప్రేక్షకుల్లో అదే సినిమాను రీమేక్ ( Remake Movies ) చేయడంతో ఇంట్రెస్ట్ పెట్టడం లేదు.
ఫ్యాన్స్ అంటే తప్పక చూస్తారు.కానీ మాములు ప్రేక్షకులకు మాత్రం రీమేక్స్ అంటే బోర్ కొట్టేసింది.
కొత్త కొత్త కంటెంట్ కోసం వెతుకుతున్నారు.అది భాషతో సంబంధం లేకుండా ఎక్కడ దొరికిగా చూసేస్తుండడంతో రీమేక్ సినిమాలకు రానురాను ఆదరణ తగ్గుతుంది.
"""/" /
కానీ చిరు వేరే భాషల్లో సూపర్ హిట్ అయిన సినిమాలను ఇక్కడ రీమేక్ చేస్తున్నారు.
కానీ వాల్తేరు వీరయ్య( Waltair Veerayya ) లాంటి స్ట్రైట్ సినిమాతో మంచి హిట్ అందుకుని ఫ్యాన్స్ కు సైతం కిక్ ఇచ్చారు చిరు.
మరి ఈ సినిమా తర్వాత చిరు కూడా రీమేక్ సినిమాలను వద్దు అని స్ట్రైట్ సినిమాలనే ( Straight Films ) ఎంచుకుంటున్నారట.
అందుకే రానున్న రోజుల్లో చిరు నుండి మంచి ట్రీట్ ఖాయం అంటున్నారు ఫ్యాన్స్.
"""/" /
ఇప్పటికే చిరు యంగ్ డైరెక్టర్ వసిష్ఠ మల్లిడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.
అలాగే ఎవరైనా ఫ్రెష్ సబ్జెక్ట్ తో వస్తే వారికీ కూడా ఓకే చెప్పేయనున్నారట.
మొత్తానికి చిరు పద్ధతిలో మార్పు రావడంతో మెగా ఫ్యాన్స్ సంతోషం వ్యాప్తం చేస్తున్నారు.
ప్రెజెంట్ అయితే చిరు వేదాళం రీమేక్ చేస్తున్నాడు.''భోళా శంకర్'' ( Bhola Shankar ) పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాను మెహర్ రమేష్ డైరెక్ట్ చేస్తుండగా.
అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.
"""/" /
ఇక ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.కీర్తి సురేష్ చిరు చెల్లెలుగా నటిస్తుంది.
మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నాడు.అలాగే ఈ సినిమాలో అక్కినేని యువ హీరో సుశాంత్ కూడా కీలక రోల్ పోషిస్తున్నాడు.
మరి ఈ సినిమాను ఆగస్టు 11న రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
ప్రస్తుతానికి అయితే ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి.చూడాలి రిలీజ్ తర్వాత ఎలాంటి హిట్ అందుకుంటుందో.
ముఖ చర్మం వైట్ గా మెరిసిపోవాలా.. అయితే ఈ క్రీమ్ మీకోసమే..!