మా ఇంట్లో పవన్ స్పెషల్… మేం ఎంత చేసిన వృధానే.. చిరు కామెంట్స్ వైరల్!
TeluguStop.com
మహిళా దినోత్సవం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ,నాగబాబు( Megastar Chiranjeevi, Nagababu ) తన ఇద్దరు సోదరీమణులు, తన తల్లి అంజనా దేవితో కలిసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అయితే ఈ ఇంటర్వ్యూలో భాగంగా చిరంజీవి ( Chiranjeevi )చిన్నప్పటి నుంచి ఎదుర్కొన్న కష్టాలు తన ఫ్యామిలీ గురించి తన తమ్ముళ్ల గురించి, తన బిడ్డల గురించి ఎన్నో విషయాలను కూడా అందరితో పంచుకున్నారు.
ఈ క్రమంలోనే తన తల్లి గురించి కూడా కొన్ని విషయాలు బయట పెట్టారు.
"""/" /
ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.మా ఇంట్లో అమ్మకు సపరేట్గా ఒక కిచెన్ ఉంటుంది ఆమెకు ఎప్పుడైనా వంట చేయాలి అనిపించినప్పుడు సరదాగా వంట చేస్తూ మా అందరికీ తిన పెడుతూ ఉంటారు.
ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan) మా ఇంటికి వస్తే మాత్రం తప్పకుండా అమ్మ కిచెన్లో కనిపిస్తుందని చిరంజీవి తెలిపారు.
వాడు బయట బాగా తిరిగి కష్టపడి వచ్చాడని స్పెషల్ గా కళ్యాణ్ కోసం వంట చేసి పెడుతుందని వెల్లడించారు.
కళ్యాణ్ బాబుకు బిర్యానీ అంటే చాలా ఇష్టం అందుకే అమ్మ తను వస్తే మాత్రం బిర్యాని వండిస్వయంగా తిని పెడుతుందని తెలిపారు.
"""/" /
అమ్మ దృష్టిలో వాడు పెద్ద ఎత్తున కష్టపడుతున్నాడని ఫీలవుతూ ఉంటుంది ఇక్కడ మేము గొడ్డులా చాకరీ చేసినా కూడా అది కనిపించదు కానీ వాడు చేసేది టీవీలలో కాస్త ఎక్కువగా చూపించేసరికి పాపం కళ్యాణ్ బాబు తెగ కష్టపడుతున్నాడని ఫీలవుతూ ఉంటుందని చిరు తెలిపారు.
కళ్యాణ్ బాబు రాజకీయాల్లో, ఎండల్లో తిరగడం చూసి అమ్మ వాడికి మరింత స్పెషల్ గా చేసి పెడుతుంది.
ఇక పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఎక్కడ ఉన్నారనే విషయాలు మాకు కొన్నిసార్లు తెలియవు కానీ తను ఎక్కడికి వెళ్తున్నారు? ఏం చేస్తున్నారనే విషయాలు మాత్రం అమ్మకు తెలుస్తాయని అలా వారిద్దరి మధ్య ఎంతో మంచి బాండింగ్ ఉంది అంటూ చిరు ఈ సందర్భంగా తెలియజేశారు.