భీమిలిలో ఇంటి స్థలం కొన్న చిరు.... స్థలం విలువెంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
TeluguStop.com
మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా తాను త్వరలోనే వైజాగ్ వాసిని అవుతానని త్వరలోనే ఇక్కడికి షిఫ్ట్ అవ్వబోతున్నానంటూ తెలియచేశారు.
ఇలా వాల్తేరు వీరయ్య సినిమా వేడుకలో భాగంగా మెగాస్టార్ చిరంజీవి ఈ విషయాన్ని తెలియజేయడంతో వైజాగ్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.
ప్రస్తుతం తాను భీమిలిలో ఇంటి స్థలం కొనుగోలు చేశానని చిరంజీవి వెల్లడించారు.ఇల్లు నిర్మాణం పూర్తి కాగానే తాను వైజాగ్ షిఫ్ట్ అవ్వబోతున్నట్లు చిరు తెలిపారు.
"""/"/
ఇక ఈయన భీమిలిలో సముద్రానికి దగ్గరగా ఇంటి స్థలం కొనుగోలు చేశారని ఆ స్థలంలో ఇంటి నిర్మాణం చేపడితే సముద్రపు వ్యూ ఉండేలా పక్క ప్లాన్ తో నిర్మించబోతున్నట్లు సమాచారం.
అయితే.భీమిలిలో ఇంటి నిర్మాణం కోసం మెగాస్టార్ చిరంజీవి భారీగానే ఖర్చు చేసి స్థలం కొనుగోలు చేశారని సమాచారం.
సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం ఈ ఇంటి స్థలం కోసం దాదాపు 30 కోట్లకు పైగా డబ్బు ఖర్చు చేశారని తెలుస్తోంది.
"""/"/
మొత్తానికి చిరంజీవి ఇకపై వైజాగ్ లో ఉంటారని తెలియచేయడంతో అభిమానులు మాత్రం సంతోషం వ్యక్తం చేశారు.
ఇక ఈయన ఇప్పటికీ వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.
గాడ్ ఫాదర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్న చిరంజీవి సంక్రాంతి పండుగ సందర్భంగా వాల్తేరు వీరయ్య సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
ఈ సినిమా పక్కా మాస్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకులను సందడి చేయబోతున్నట్లు తెలుస్తోంది ఈ సినిమా జనవరి 13వ తేదీ విడుదల కానుంది.
పుష్ప 2 పాటకి లేడీ ప్రొఫెసర్ మాస్ స్టెప్పులు.. చూస్తుంటే వచ్చుండాయ్ పీలింగ్స్!