ఆ గొడవ వల్ల చిరంజీవి సినిమా పోయింది: వల్లభనేని జనార్ధన్

కొన్ని కొన్ని సార్లు ఇండస్ట్రీకి చెందిన ప్రముఖుల మధ్య కూడా గొడవలు జరుగుతూ ఉంటాయి.

అది వ్యక్తిగతంగా కాకుండా సినిమాలపరంగా జరుగుతూ ఉంటాయి.కానీ అవి సినిమాల వరకు మాత్రమే ఉంటాయి.

బయటికి వస్తే వాళ్లంతా ఒకటే అవుతారు.కానీ సినిమాల పరంగా గొడవలు అయితే మాత్రం ఆ సమయంలో చాలా అవకాశాలు, సలహాలు కోల్పోతారు.

అలా డైరెక్టర్ వల్లభనేని జనార్ధన్ జీవితంలో కూడా ఒక చిన్న గొడవ వల్ల చిరంజీవి సినిమాను కోల్పోయాడు.

ఇంతకు అసలు విషయం ఏంటో తెలుసుకుందాం.అయితే డైరెక్టర్ జనార్ధన్ అంటే ఈతరం ప్రేక్షకులకు అంతగా పరిచయం లేకపోవచ్చు కానీ.

ఒకప్పటి ప్రేక్షకులకు మాత్రం ఈయన సినిమాల గురించి బాగా తెలుసు.ఈయన దర్శకుడుగానే కాకుండా నటుడుగా కూడా చేశాడు.

దాదాపు 125 పైగా సినిమాలలో నటించాడు.మొదటిసారి రాఘవేంద్రరావు దర్శకత్వం వచ్చిన గజదొంగ సినిమాకు పని చేశాడు.

ఆ తర్వాత పలు సినిమాలలో చేయగా.సొంతంగా అర్జున్ ఆర్ట్స్ నిర్మాణ సంస్థను స్థాపించాడు.

సొంత అనుభవంతో మామగారి మనవలు అనే సినిమాను కూడా నిర్మించాడు.కానీ ఈ సినిమా 70% పూర్తయ్యాక సినిమా మధ్యలోనే ఆగిపోయింది.

డబ్బులు లేక సినిమా ఆగిపోయింది.ఇక అదే సమయంలో స్టార్ డైరెక్టర్ విజయ బాపినీడు మూడో కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు.

ఇక విజయబాపినీడు, లక్ష్మీ ఫిలింస్ అధినేత లింగమూర్తిలు అతని సినిమాను చూసి కొత్తగా దర్శకత్వం వహిస్తున్నప్పుడు పవర్‌ఫుల్ సబ్జెక్టు ఉండాలని సలహాలు ఇవ్వడంతో జనార్ధన్ ఆ సినిమాను పక్కన పెట్టి అమాయక చక్రవర్తి పేరుతో రీమేక్ సినిమాను తీయగా మంచి సక్సెస్ అందుకున్నాడు.

ఆ తర్వాత మరికొన్ని సినిమాలు చేయగా అందులో కొన్ని సక్సెస్ లు అందుకున్నాయి.

మరికొన్ని నిరాశ చెందాయి.అయితే గతంలో ఈయన సినిమాలపై కొన్ని విమర్శలు కూడా వచ్చాయి.

ఇంకా ఇదంతా పక్కన పెడితే గతంలో ఈయన చిరంజీవితో సినిమా చేయాలనుకున్నాడు.కానీ ఒక గొడవ వల్ల ఆయన చిరంజీవితో సినిమా చేయలేకపోయాడు.

"""/"/ ఇక ఈ విషయాన్ని తానే స్వయంగా తెలిపాడు.తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా తన గురించి చాలా విషయాలు పంచుకున్నాడు.

అయితే గతంలో తనకు పిల్లనిచ్చిన మామతో ఓ సినిమా షూటింగ్ సమయంలో కొన్ని ఘర్షణలు జరిగాయని దీంతో ఆ సమయంలో చిరంజీవితో సినిమా చేయాలనుకున్న కూడా అవకాశం పోయిందని తెలిపాడు.

అంతేకాకుండా తన నిర్మాణ సంస్థల గురించి కూడా కొన్ని విషయాలు తెలిపాడు.గతంలో తన సినిమాల విషయంలో తను ఎదుర్కొన్న విషయాల గురించి కూడా క్లారిటీ ఇచ్చాడు.

ఇక ప్రస్తుతం ఆయనను చేసిన ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.

అధికారం వచ్చినా ఆనందం లేదా ? ఎందుకిలా ?