చిరంజీవి అభిమానులకు బ్యాడ్‌ న్యూస్‌

మెగాస్టార్‌ చిరంజీవి బర్త్‌డే కోసం మెగా ఫ్యాన్స్‌ ఏ స్థాయిలో ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

చిరంజీవి బర్త్‌డే కానుకగా ఆచార్య ఫస్ట్‌లుక్‌ రాబోతుంది.ఇప్పటికే ఆ విషయమై స్వయంగా నిర్మాత అయిన రామ్‌ చరణ్‌ క్లారిటీ ఇచ్చాడు.

రామ్‌ చరణ్‌ భారీ ఎత్తున నిర్మిస్తున్న ఆచార్య చిత్రం టైటిల్‌ విషయంలో ఇంకా అధికారిక క్లారిటీ ఇవ్వలేదు.

బర్త్‌డే సందర్బంగా టైటిల్‌ విషయంలో కూడా అధికారికంగా ప్రకటన చేయడంతో పాటు ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసే అవకాశం ఉంది.

చిరు బర్త్‌డే సందర్బంగా ఆచార్య అప్‌డేట్‌తో పాటు కొత్త సినిమాను కూడా ప్రకటించబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి.

బాబీ దర్శకత్వంలో చిరు మూవీ చేయబోతున్నాడు.ఆ సినిమాను అధికారికంగా ప్రకటిస్తారనే ప్రచారం జరిగింది.

మైత్రి మూవీ మేకర్స్‌ వారు ఫస్ట్‌లుక్స్‌ విషయంలో మరియు హీరోల బర్త్‌డేల విషయంలో చాలా ఉత్సాహంగా ఉంటారు.

వారు పోస్టర్‌లను విడుదల చేసే తీరుతో సినిమాలకు మంచి పబ్లిసిటీ దక్కుతుంది.చిరంజీవితో మైత్రి వారు చేయబోతున్న సినిమా తాలూకు ప్రీ లుక్‌ లేదా ఏదో ఒక ప్రకటనను బర్త్‌డే సందర్బంగా రివీల్‌ చేసే అవకాశం ఉందని అంతా అనుకున్నారు.

అయితే ఇంకా స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తి కాలేదు.చిరంజీవి స్క్రిప్ట్‌ పూర్తిగా విని ఓకే చేసిన తర్వాతే ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివరాలు రివీల్‌ చేయాలని మైత్రి మూవీస్‌ వారు నిర్ణయించుకున్నారట.

మైత్రి మూవీ మేకర్స్‌ వారు చేసే ఈ సినిమా నిర్మాణంలో రామ్‌ చరణ్‌ కూడా నిర్మాణ భాగస్వామిగా ఉంటాడని తెలుస్తోంది.

వెల్లుల్లి పొట్టు ప‌నికిరాద‌ని పారేస్తున్నారా.. అయితే ఈ పోష‌కాల‌న్నీ మీరు కోల్పోతున్న‌ట్లే!