విశ్వంభర కోసం మెగా కసరత్తులు.. వైరల్ అవుతున్న వీడియో?

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi ) ఏడాది మొదట్లోనే పద్మ విభూషణ్ అవార్డు అందుకోవడంతో ఆయన కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి తర్వాత కెరియర్ పరంగా కూడా ఎంతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఈయన వశిష్ట ( Mallidi Vasishta ) దర్శకత్వంలో విశ్వంభర ( Vishawmbhara )అనే సినిమా షూటింగ్ పనులలో బిజీ కానున్నారు.

ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ పనులను ప్రారంభం చేసుకోబోతోంది.గత ఏడాది పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకున్నటువంటి ఈ సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని టైటిల్ విడుదల చేశారు.

"""/" / ఇక త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పనులు ప్రారంభం కానున్న నేపథ్యంలో చిరంజీవి ఈ సినిమా పనుల కోసం తనని తాను పూర్తిగా సిద్ధం చేసుకుంటున్నారు.

తాజాగా ఈయన జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ ఉన్నటువంటి వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ప్రతి ఒక్కరు ఎంతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఆరు పదుల వయసు దాటుతున్నటువంటి సమయంలో చిరంజీవి చాలా చురుగ్గా ఇలాంటి భారీ వర్కౌట్ చేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

"""/" / ఇక ఈ సినిమా ఈవారం మొదటి షెడ్యూల్ చిత్రీకరణ జరుపుకోబోతోంది దీనికోసం హైదరాబాద్ లో భారీ సెట్ వేశారని తెలుస్తోంది.

ఇలా సినిమా కోసం తనని తాను చిరంజీవి మల్చుకున్నటువంటి తీరు అందరిని ఆశ్చర్యాన్ని కలిగించడమే కాకుండా సినిమా కోసం ఇలా కష్టపడతారు కనుక ఆయన ఈ స్థాయిలో ఉన్నారు అంటూ చిరంజీవి వీడియో పై నేటిజన్స్ కామెంట్ లు చేస్తున్నారు.

ఇక ఈ సినిమా యువి క్రియేషన్ బ్యానర్స్( UV Creation Banners ) పై ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.

 .

ఈ యంగ్ డైరెక్టర్స్ భారీ సక్సెస్ కొడితే పాన్ ఇండియా లో స్టార్ డైరెక్టర్స్ గా మారుతారా..?