బాగుండాలబ్బా అంటోన్న చిరు

మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుని ఫ్యాన్ ఫాలోయింగ్‌ను పెంచుకున్నాడు.

ఇప్పటికే మెగా హీరోల్లో బన్నీ సూపర్ సక్సెస్‌తో దూసుకుపోతున్నాడు.ఇటీవల అల వైకుంఠపురములో సినిమాతో అదిరిపోయే సక్సెస్ అందుకున్న బన్నీ, తాజాగా సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.

ఏప్రిల్ 8న పుట్టిన రోజు జరుపుకుంటున్న బన్నీకి అభిమానులతో పాటు పలువురు సెలెబ్రిటీలు సైతం శుభాకాంక్షలు తెలిపారు.

కాగా బన్నీ పుట్టిన రోజున మెగాస్టార్ చిరంజీవి కూడా విషెస్ తెలిపాడు.బన్నీ తన లేటెస్ట్ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసే క్రమంలో చిత్తూరు యాసలో రిలీజ్ చేసిన అప్‌డేట్‌ చిరుకు బాగా నచ్చడంతో, అదే యాసలో ఇప్పుడు బన్నీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు.

‘డ్యాన్స్‌లో గ్రేస్, ఆ వయస్సు నుంచే ఉంది.బన్నీలోని కసి, కృషి నాకు చాలా ఇష్టం.

హ్యపీ బర్త్‌డే బన్నీ.నువ్వు బాగుండాలబ్బా!’ అంటూ చిరు ట్వీట్ చేశాడు.

ప్రస్తుతం చిరు చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.కాగా బన్నీ పుట్టినరోజున తన తాజా చిత్రం పుష్ప ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు.

సినిమా ఇండస్ట్రీ లో అసలేం జరుగుతుంది…ఎలాంటి కథలు సక్సెస్ అవుతున్నాయి…