జక్కన్నతో సినిమాపై చిరు క్లారిటీ.. తనతో ఖచ్చితంగా వర్క్ చేస్తా.. కానీ..

ప్రెసెంట్ టాలీవుడ్ లో ఆచార్య మ్యానియా నడుస్తుంది.టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన సినిమా ఆచార్య.

ఇందులో రామ్ చరణ్ సిద్ధ అనే పవర్ ఫుల్ రోల్ లో నటించాడు.

చిరు కి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తే రామ్ చరణ్ కు జోడీగా పూజా హెగ్డే నటించింది.

చిరు, చరణ్ ఇద్దరు కూడా ఈ సినిమాలో కలిసి నటించడం వల్ల ఈ సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది.

ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడడంతో ప్రొమోషన్స్ స్పీడ్ గా చేస్తూన్నారు మేకర్స్.

వరుస అప్డేట్ లు ఇస్తుండడంతో అవి మెగా అభిమానులను ఆకట్టుకున్నాయి.అలాగే ఈ సినిమా మరో రెండు రోజుల్లో రానున్న క్రమంలో వరుసగా ప్రెస్ మీట్ లు చేస్తూ ఇంటర్వ్యూలు ఇస్తూ ఈ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేస్తున్నారు.

"""/" / తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో డైరెక్టర్ రాజమౌళి సైతం హాజరయిన విషయం విదితమే.

ఈ క్రమంలోనే మెగాస్టార్ పలు ఆసక్తికర కామెంట్స్ చేసారు.ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ రాజమౌళి కాంబోలో సినిమా రాబోతుందనే క్రేజీ రూమర్ తెరమీదకు వచ్చింది.

అయితే ఈ క్రమంలోనే ఈ రూమర్స్ పై తాజాగా చిరంజీవి పాల్గొన్న ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు.

"""/" / తాజాగా చిరు పాల్గొన్న ఇంటర్వ్యూలో ఈ రూమర్ పై క్లారిటీ ఇచ్చారు.

మా ఇద్దరి కాంబోలో సినిమా వస్తుంది అని వస్తున్న ఊహాగానాలపై ఎలాంటి నిజం లేదని తనతో వర్క్ చేస్తానని కానీ అది జరిగే అవకాశం అయితే లేదు అని నేను అనుకుంటున్నానని చెప్పుకొచ్చాడు చిరు.

దీనిపై ఈ కాంబో వస్తుంది అన్న ఊహాగానాలకు ఫుల్ స్టాప్ పడింది.మరి ఫ్యూచర్ లో రాజమౌళి చిరు కి అవకాశం ఇస్తాడో లేదో చూడాలి.

ఏందయ్యా ఇది? యాపిల్ వాచ్ సింహం హార్ట్ రేట్ కూడా కొలుస్తుందా..??