చిరంజీవి విశ్వంభర సినిమా నుంచి సర్ప్రైజ్ ఇవ్వనున్నరా..?
TeluguStop.com
మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi ) గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆయన చేసిన సేవల గురించి ప్రతి ఒక్కరు చెబుతారు.
ఇక మెగాస్టార్ చిరంజీవి సినిమాలు వరుసగా మంచి హిట్ కావాలనే ఉద్దేశ్యం తోనే ఆయన అభిమానులతో పాటు ప్రేక్షక జనాలు కూడా కోరుకుంటూ ఉంటారు.
ఎందుకంటే చిరంజీవి అంటే ప్రతి ఒక్క ప్రేక్షకుడికి కూడా చాలా ఇష్టం ఉంటుంది.
ఆయన వ్యక్తిత్వం గానీ, ఆయన చేసే సేవ గాని సగటు జనాల్ని ఆదుకునే విధంగా ఉంటుంది.
కాబట్టి చిరంజీవి పేరు చెబితేనే ప్రతి ఒక్కరిలో ఒక సాఫ్ట్ కార్నర్ అయితే ఉంటుంది.
"""/" /
ఇక అదే విధంగా చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర ( Vishwambhara ) అనే సినిమా చేస్తున్నాడు.
అయితే ఈ సినిమా నుంచి ఒక సరైన సర్ప్రైజ్ కూడా తన అభిమానులకు చిరంజీవి ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది.
అది ఏంటి అంటే ఈ సినిమాను తొందర్లోనే రిలీజ్ చేసి ప్రేక్షకుల అటెన్షన్ ని తన వైపు తిప్పుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు.
ఇక అందులో భాగంగానే ప్రస్తుతం ఆయన చాలా రకాలుగా ఈ సినిమా కోసం కష్టపడుతున్నట్టుగా తెలుస్తుంది.
ఇక ముఖ్యంగా 70 సంవత్సరాల వయసు లో కూడా తను ఏమాత్రం అలసిపోకుండా ఈ సినిమా కోసం దాదాపు 18 గంటల పాటు కష్టపడుతూనే ఉంటున్నాడు అంటే చిరంజీవి గారి డెడికేషన్ ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు.
"""/" /
ఇక ఈ సినిమాకి ముందు వచ్చిన భోళా శంకర్( Bhola Shankar ) మూవీ ఫ్లాప్ అవడంతో ఈ సినిమాతో ఎలాగైనా సరే సక్సెస్ ని సాధించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు.
ఇక అందులో భాగంగానే డైరెక్టర్ వశిష్ఠ( Director Vassishta ) కూడా ఈ సినిమా ను చాలా బాగా చిత్రీకరిస్తున్నట్టుగా తెలుస్తుంది.