పవన్ బాబు మధ్య వార్ ! చిరు బుజ్జగింపు ?
TeluguStop.com
మెగా స్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టిన సమయంలో ఆయనకు ఎంతో మంది ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు అందించాఋ.
అయితే పార్టీ ఎన్నికల్లో కొద్ది సీట్లే దక్కించుకోవడంతో పాటు ఆ తరువాత వచ్చిన ఒడిడుకులు నేపథ్యంలో ప్రజారాజ్యం పార్టీని చిరు కాంగ్రెస్ లో విలీనం చేసేసాడు.
ఆ సమయంలో చిరు వెంట ప్రస్తుత వైసీపీ మంత్రి కురసాల కన్నబాబు ఉన్నారు.
అయితే ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనం ఆఫ్వడానికి, చిరుకి ఆ రకమైన పరిస్థితులు తలెత్తడానికి ప్రధాన కారణం కన్నబాబే అన్న అనుమానం ఎప్పటి నుంచో చిరు తమ్ముడు పవన్ కు ఉంది.
అందుకే ఎన్నికల ప్రచారంలో కూడా కన్నబాబు కి వ్యతిరేకంగా పవన్ గట్టిగా గళం విప్పి ఘాటు విమర్శలు చేసాడు.
ఇప్పుడు విశాఖ లో చేప్పట్టిన ఇసుక దీక్షలో భాగంగా చేపట్టిన లాంగ్ మార్చ్ లో కూడా ఇదే రకమైన విమర్శలు చేసాడు పవన్.
అయితే పవన్ చేసిన ఈ వ్యాఖ్యలు కాపు సామజిక వర్గంలోనూ వ్యతిరేకతను పెంచాయి.
తరచు కన్నబాబును ఎందుకిలా పవన్ టార్గెట్ చేస్తున్నారన్న ప్రశ్నలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
నిజంగా చిరుని కన్నబాబు తప్పుదోవ పట్టిస్తే చిరు ఇప్పటికి కన్నబాబు కి ఎందుకు ప్రాధాన్యం ఇస్తున్నాడు ? ఇటీవల కన్నబాబు సోదరుడు మరణించిన సందర్భంగా చిరు స్వయంగా కన్నబాబు ఇంటికి వెళ్లడం తదితర విషయాలను వారు గుర్తు చేస్తున్నారు.
పవన్ కంటే కన్నబాబు కి చిరు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారనే బాధ పవన్ లో ఎక్కువ కనిపిస్తున్నాయని విమర్శలు కూడా పెరిగిపోతున్నాయి.
పవన్ -కన్నబాబు వ్యవహారం ఈ విధంగా హాట్ టాపిక్ గా ఏపీ రాజకీయాల్లో చేర్చకు తెరలేపింది.
"""/"/తాజాగా ఇదే విషయమై మంత్రి కన్నబాబు కి మెగా స్టార్ చిరంజీవి ఫోన్ చేసి పరామర్శించినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
తమ్ముడు చేసిన కామెంట్లను సీరియస్ గా తీసుకోవద్దని, రాజకీయ విబేధం తప్ప పవన్ కు నీ మీద ఎటువంటి వ్యక్తిగత విబేధాలు లేవని చెప్పినట్టు సమాచారం.
ఈ మధ్య సైరా సినిమా షో లకు సంబంధించి చిరుకి కన్నబాబు సహాయం చేయడం, జగన్ తో చిరు భేటీ ఏర్పాటు చేయడంలో కన్నబాబు కీ రోల్ పోషించారు.
ఇటువంటి నేపథ్యంలో పవన్ వాఖ్యలు కన్నబాబు ని బాగా బాధిస్తాయని గమనించి, ఆయనే ఫోన్ చేసి కన్నబాబుతో మాట్లాడి బుజ్జగించినట్టు తెలుస్తోంది.
దంతాలపై పసుపు మరకలను పోగొట్టే బెస్ట్ హోమ్ రెమెడీస్ మీకోసం!