ఫ్యాక్షన్ యూనివర్స్ కావాలంటున్న చిరు.. ఇంద్ర, సమరసింహా కలిస్తే మామూలుగా ఉండదుగా!

తాజాగా బాలయ్య బాబు( Balayya Babu ) 50 ఏళ్ల సినీ వసంతాల వేడుకలు ఘనంగా జరిగిన విషయం తెలిసిందే.

నిన్నటి రోజున జరిగిన ఈ వేడుకకు టాలీవుడ్ ( Tollywood )లో ఉండే చాలా మంది సెలబ్రెటీలు హాజరయ్యారు.

చిన్న చిన్న హీరోలనుంచి స్టార్ హీరోల వరకు ప్రతి ఒక్కరూ హాజరయ్యారు.ఇక ఈ వేడుకలో భాగంగా చాలామంది ప్రసంగించిన విషయం తెలిసిందే.

అందులో భాగంగానే మెగాస్టార్ చిరంజీవి( Megastar Chiranjeevi ) ఈ వేడుకలో భాగంగా మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.తనకు కూడా ఒక యూనివర్స్ కావాలంటున్నారు మెగాస్టార్ చిరంజీవి.

"""/" / అది కూడా అలాంటి ఇలాంటి యూనివర్స్ కాదట.ఫ్యాక్షన్ యూనివర్స్( Faction Universe ).

అవును.ఇంద్ర, సమరసింహా రెడ్డి పాత్రలతో ఒక కథ ఆశిస్తున్నారట మెగాస్టార్ చిరంజీవి.

ఇప్పుడంతా సీక్వెల్స్, ప్రీక్వెల్స్, పార్ట్ 1, పార్ట్ 2 అంటున్నారు.ఇలాంటి టైమ్ లో ఎవరైనా ముందుకొచ్చి ఇంద్రసేనారెడ్డి, సమరసింహారెడ్డి పాత్రలతో ఒక సినిమా కథ రాసుకొస్తే అందులో నటించడానికి నేను రెడీ.

బాలయ్య మీరు రెడీనా? అని స్టేజిపై అడగగా పక్కనే ఉన్న బాలయ్య బాబు కూడా సై అంటే సై అన్నారు.

ఆ వెంటనే బోయపాటి వైపు తిరిగి దీన్నొక ఛాలెంజ్ గా తీసుకోమన్నారు చిరంజీవి.

అయితే బాలకృష్ణ 50 వసంతాల సినీకెరీర్ సందర్భంగా ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న చిరంజీవి ఈ వ్యాఖ్యలు చేశారు.

"""/" / వరుస ఫ్యాక్షన్ కథలతో బాలయ్య బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడుతున్న టైమ్ లో, తన దగ్గరకు ఇంద్ర సినిమా కథ వచ్చినప్పుడు, మెప్పించగలనా లేదా అని తర్జనభర్జన పడ్డారట చిరంజీవి.

చివరకి కథలో బలం ఉండడంతో చేశారట.మరి మెగాస్టార్ చిరంజీవి కోరిక మేరకు ఫ్యాక్షన్ యూనివర్స్ లో కథను ఎవరి వినిపిస్తారు ఎవరు ఆయన కలని తీరుస్తారో చూడాలి మరి.

ఈ సందర్భంగా చిరు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇద్దరు స్టార్ హీరోలను పక్కన చూడడంతో నందమూరి అభిమానులు మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇదేందయ్యా ఇది.. జింక అలా ఎగురుతుంది? (వీడియో)