Chiranjeevi: ఆ వ్యక్తి చేసిన పనికి పెళ్లి వాయిదా వేసుకోవాలనుకున్న చిరంజీవి.. కానీ చివరికి..!!

మెగాస్టార్ పేరు చెప్పగానే లక్షలాది మంది అభిమానులు ఆయన గురించి గర్వంగా చెప్పుకుంటారు.

ఇక ఈ మధ్యకాలంలో భోళా శంకర్ (Bhola Shankar) సినిమాతో ప్లాఫ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ అలాంటి సినిమాలు ఆయన కెరియర్ లో ఎన్నో ఉన్నాయి.

ఆ తర్వాత ఎన్నో ఇండస్ట్రీ హిట్లు కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి.చిరంజీవి( Chiranjeevi ) కెరీర్ లో భోళా శంకర్ వంటి ప్లాఫ్ సినిమాలను అస్సలు పట్టించుకోరు.

ఆ సినిమాలతో తన రేంజ్ ఏమీ పడిపోదు అంటారు ఆయన అభిమానులు.ఇక నెక్స్ట్ వచ్చే సినిమాతో మళ్లీ ఆయన సత్తా నిరూపించుకుంటారని అభిమానులు గర్వంగా చెప్పుకుంటున్నారు.

ఈ విషయం పక్కన పెడితే మెగాస్టార్ చిరంజీవి అల్లు రామలింగయ్య (Allu Ramalingaiah) కూతురు సురేఖ ని పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే.

అయితే వీరి పెళ్లి టైం లో ఒక సంఘటన జరిగిందట.ఆ సంఘటన వల్ల చిరంజీవి (Chiranjeevi) పెళ్లి కూడా దాదాపు వాయిదా పడే స్టేజ్ కి వెళ్ళిందట.

ఇక అసలు విషయంలోకి వెళ్తే.చిరంజీవి అప్పుడప్పుడే సోలో హీరోగా ఎదుగుతున్న టైం లో అల్లు రామలింగయ్య తన కూతుర్ని చిరంజీవికి ఇచ్చి పెళ్లి చేయాలనే నిర్ణయించుకున్నారు.

దీనికి చిరంజీవి ఫ్యామిలీ కూడా ఓకే చెప్పడంతో 1980 ఫిబ్రవరి 20న పెళ్లి నిశ్చయించుకున్నారు.

"""/" / ఇదే సమయంలో చిరంజీవి హీరోగా ఓ సినిమాలో నటిస్తున్నారు.ఇక అందులో కీలక పాత్రలో నటుడు నూతన ప్రసాద్ (Nuthana Prasad) నటిస్తున్నారు.

ఇకఅప్పట్లో నూతన ప్రసాద్ క్రేజ్ ఎలా ఉండేదంటే ఒకసారి ఆయన డేట్స్ మిస్ అయ్యాయి అంటే మళ్ళీ మూడు నెలల వరకు ఆ షూటింగ్ కి వచ్చేవారు కాదట.

ఆయన అప్పట్లో చాలా బిజీయెస్ట్ ఆర్టిస్టుగా సినిమాల్లో కొనసాగారు.ఇక అలాంటి సమయంలో చిరంజీవి పెళ్లి రోజే నూతన ప్రసాద్ కి చిరంజీవికి మధ్య కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కించాల్సి ఉందట.

దాంతో నిర్మాత, దర్శకుడు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకున్నారట.అంతేకాదు చిరంజీవి ఈ విషయం తెలిసి తన పెళ్లిని కూడా నూతన ప్రసాద్ కోసం వాయిదా వేసుకునే స్టేజి వరకు వెళ్లారట.

"""/" / కానీ ఇదంతా గమనించిన నిర్మాత ఇటు నూతన ప్రసాద్ డేట్స్ మిస్ అవ్వకుండా అలాగే అటు చిరంజీవి (Chiranjeevi) పెళ్లి కూడా వాయిదా పడకుండా ఉండడానికి చిరంజీవి పెళ్లి ఎక్కడ జరుగుతుందో ఆ కళ్యాణ మండపానికి దగ్గరలో చిరంజీవి నూతన ప్రసాద్ మధ్య సన్నివేశాలను తెరకెక్కించారట.

ఇక చిరంజీవి ఆ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని తొందర తొందరగా కళ్యాణ మండపానికి చేరుకొని ముహూర్తం సమయం దగ్గర పడడంతో షూటింగ్లో ఉండే చిరిగిన చొక్కా తోనే సురేఖ (Surekha) మెడలో తాళి కట్టారు.

ఇలా చిరంజీవికి నటనపై ఎంతలా ఆసక్తి ఉంటుందో ఈ ఒక్క సంఘటన చూసి అర్థం చేసుకోవచ్చు.

విద్యార్థినికి అసభ్యకరమైన మెసేజ్‌లు పంపిన ఉపాధ్యాయుడిని చితకబాదిన తల్లిదండ్రులు