చిరంజీవి, కమల్ హాసన్.. ఒకరు సర్ ప్రైజ్ చేస్తే.. మరొకరు నిరాశ పరిచారు?

సినిమా పరిశ్రమలో సెంటిమెంట్లు కొన్ని కొన్ని సార్లు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి.

ఒక తేదీన విడుదలైన సినిమా సూపర్ హిట్ అయిందంటే అదే తేదీన మరోసారి సినిమాను విడుదల చేయాలని అనుకుంటారు దర్శక నిర్మాతలు.

మరోసారి కూడా సినిమా హిట్ అయిందంటే ఇక ఆ ఆ తేదీని తమకు సెంటిమెంట్గా మార్చేసుకుంటారు.

ఇక ఆ తర్వాత ఏ సినిమా తీసిన అదే రోజున విడుదల చేయాలని భావిస్తూ ఉంటారు.

ఇండస్ట్రీలో ఎంతో మంది సినీ నటులు దర్శకులు నిర్మాతలు కూడా కలిసొచ్చిన తేదీల్లోనే మళ్లీమళ్లీ సినిమాలను విడుదల చేస్తూ అదృష్టాన్ని పరీక్షించుకుంటు ఉండటం ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది.

ఇక ఇప్పుడు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి లోకనాయకుడు కమల్ హాసన్ ఇలాగే తమకు అచ్చొచ్చిన తేదీల్లో సందడి చేశారు అని తెలుస్తోంది.

అయితే చిరు సినిమా డిజాస్టర్ అయితే కమల్ సినిమా మాత్రం బ్లాక్బస్టర్ అయ్యింది.

ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.1988లో చిరంజీవి యముడికి మొగుడు అనే సినిమా లో నటించాడు.

ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.ఎన్నో రికార్డులను తిరగరాసింది.

అయితే ఆ సినిమా విడుదలైన ఏప్రిల్ 29వ తేదీన ముప్పై నాలుగేళ్ల తర్వాత భారీ అంచనాల మధ్య ఆచార్య సినిమా విడుదల చేశాడు చిరంజీవి.

"""/"/ కానీ ఆచార్య సినిమా అనుకున్నంతగా ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదు.చిరంజీవితో పాటు ఆయన తనయుడు రామ్ చరణ్ హీరోగా నటించిన సినిమాలు ముందుకు నడిపించే లేక పోయారు.

చివరికి మెగాస్టార్ కెరియర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిపోయింది ఆచార్య.ఇక కమలహాసన్ విషయానికి వస్తే.

1983 జూన్ 3వ తేదీన కమల్హాసన్ హీరోగా నటించిన సాగరసంగమం సినిమా విడుదల ఆల్ టైం హిట్ గా నిలిచింది.

ఇప్పటికీ ఈ సినిమా ఎంతో మంది ప్రేక్షకులకు ఫేవరేట్ అని చెప్పాలి.ఇప్పుడు ఇదే తేదీన యాక్షన్ థ్రిల్లర్ సినిమాగా తెరకెక్కిన విక్రమ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్దిరిపోయే విజయాన్ని అందుకున్నాడు కమల్ హాసన్.

ఇలా అచ్చొచ్చిన తేదీలలో తమ సినిమాలను విడుదల చేసిన చిరంజీవి కమలహాసన్ ఇద్దరూ కూడా విభిన్న ఫలితాలను అందుకున్నారు అని చెప్పాలి.

ఎంతో పుణ్యం చేసుకుంటే ఇంత మంచి కొడుకు పుట్టాడు.. థమన్ తల్లి కామెంట్స్ వైరల్!