విశ్వంభర నుంచి బిగ్ అప్డేట్… డబ్బింగ్ పనులు మొదలు.. షూటింగ్ అయిపోయినట్టేనా?

మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi ) డైరెక్టర్ వశిష్ట( Vasista ) దర్శకత్వంలో విశ్వంభర( Vishwambara ) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ పనులు జరుపుకుంటుంది.సోషియో ఫాంటసీ నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఈ క్రమంలోనే  శరవేగంగా షూటింగ్ పనులను కూడా జరుపుకుంటుంది.ఇక ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవికి జోడిగా త్రిష( Trisha ) నటిస్తున్నారు.

అలాగే మరొక హీరోయిన్ ఆశికా రంగనాథ్ కూడా ఈ సినిమాలో భాగమయ్యారు. """/" / ఇలా షూటింగ్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి ఇటీవల మేకర్స్ బిగ్ అప్డేట్ విడుదల చేశారు.

ఈ సినిమా ఇటీవల పూజా కార్యక్రమాలతో డబ్బింగ్( Vishwambara Dubbing ) పనులను కూడా మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.

ఇందుకు సంబంధించిన ఫోటోలను మేకర్స్ సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.అయితే ఈ ఫోటోలు వైరల్ గా మారడంతో అప్పుడే షూటింగ్ పూర్తి అయిందా అన్న సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

"""/" / ఈ సినిమా దాదాపు 60% షూటింగ్ పనులు పూర్తి చేసినట్టు తెలుస్తుంది.

అయితే ఇప్పటివరకు అయిన  షూటింగ్ డబ్బింగ్ పనులతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరుపుకోనున్నారని తెలుస్తోంది.

ఇలా ఎప్పటికప్పుడు డబ్బింగ్ పనులను కూడా పూర్తి చేస్తే అనుకున్న సమయానికే సినిమా కూడా షూటింగ్ పూర్తి అవుతుందని మేకర్స్ భావించారు.

ఈ క్రమంలోనే ఈ సినిమా డబ్బింగ్ పనులు కూడా ప్రారంభమయ్యాయి.ఇక ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10వ తేదీ ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

కాశ్మీరీ పండిట్ల వలసకు 35 ఏళ్లు .. యూకే పార్లమెంట్‌లో తీర్మానం