Bhola Shankar: భోళా శంకర్ సినిమాకి ఆ అమ్మాయిని వద్దని అడిగి మరీ శ్రీముఖిని తీసుకున్న చిరంజీవి.. ఎందుకంటే..?

మరికొద్ది గంటల్లో మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్( Bhola Shankar ) సినిమా విడుదల కాబోతుంది.

ఇక ఈ సినిమా మరికొద్ది గంటల్లో విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా గురించి ఎన్నో వార్తలు మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అయితే తాజాగా ఈ సినిమాలో శ్రీముఖి ( Sreemukhi ) పాత్ర కోసం ఓ అమ్మాయిని అనుకుంటే కావాలనే చిరంజీవి ఆ అమ్మాయిని తీసేసి శ్రీముఖిని అడిగి మరీ పెట్టించుకున్నారు అంటూ ఒక వార్త వైరల్ గా మారింది.

ఇక అసలు విషయం ఏమిటంటే.భోళా శంకర్ సినిమాలో శ్రీముఖి చిరంజీవికి మధ్య కొన్ని కామెడీ సన్నివేశాలు ఉంటాయట.

"""/" / అయితే కామెడీ సన్నివేశాలు అంటే కామెడియన్ ని పెడితే బాగుంటుంది అని మెహర్ రమేష్ ( Mehar Ramesh ) ఈ పాత్రకి జబర్దస్త్ కమెడియన్ రోహిణి( Jabardasth Rohini ) ని అనుకున్నారట.

ఇక ఈ విషయం చిరంజీవి( Chiranjeevi ) కి చెబితే వామ్మో ఆ అమ్మాయా.

ఆ అమ్మాయి కామెడీ చేస్తే నేను కూడా ఆశ్చర్య పోవాల్సిందే.అంతేకాదు ఆ అమ్మాయి కామెడీ ముందు నేను నిలవలేను.

"""/" / ఆమెతో చాలా కష్టం ఆ ప్లేస్ లో వేరే అమ్మాయిని పెట్టండి అంటూ చిరంజీవి చెప్పారట.

దాంతో మెహర్ రమేష్ చిరంజీవి వద్దనడంతో రోహిణి పాత్రలో శ్రీముఖి ని తీసుకున్నారట.

కానీ కరెక్ట్ గా చెప్పాలంటే ఆ పాత్రకి రోహిణి మాత్రమే న్యాయం చేయగలదు.

కానీ రోహిణి ని వద్దని శ్రీముఖి ( Srimukhi ) ని తీసుకోవడం వెనుక వేరే ఏదో ఉందని,కావాలనే చిరంజీవి ఆ అమ్మాయిని తీసేసారంటూ కొంతమంది నెటిజెన్స్ కామెంట్లు పెడుతున్నారు.

ఏది ఏమైనాప్పటికి చిరంజీవి సినిమాలో నటించే ఛాన్స్ ని రోహిణి మిస్ అయింది అని చెప్పవచ్చు.

బాలయ్య, వెంకటేష్ ఫ్యాన్స్ ఆ విషయంలో అసంతృప్తి తో ఉన్నారా..?