మూడు సినిమాలు సమాంతరంగా.. మెగాస్టార్ ప్లాన్
TeluguStop.com
మెగా స్టార్ చిరంజీవి ఆచార్య సినిమా షూటింగ్ పూర్తి చేసి విడుదలకు రెడీ చేశాడు.
కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఆ సినిమా విజయం పక్కా అనే నమ్మకంతో అభిమానులు ఉన్నారు.
చిరంజీవికి జోడీగా ఆ సినిమాలో కాజల్ అగర్వాల్ నటించగా రామ్ చరణ్ మరియు పూజా హెగ్డేలు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.
భారీ ఎత్తున అంచనాలున్న ఈ సినిమా తర్వాత చిరంజీవి వరుసగా సినిమాలు చేస్తున్నాడు.
ఇప్పటికే మూడు సినిమా లను ప్రకటించి చిరంజీవి అభిమానులకు గుడ్ న్యూస్ తెలియజేశాడు.
మూడు సినిమా లకు మూడు సినిమా లు కూడా షూటింగ్ ప్రారంభం అయ్యాయి.
మొదటగా లూసీఫర్ రీమేక్ గాడ్ ఫాదర్ ను మొదటు పెట్టారు.ఆ సినిమాకు తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వం వహించబోతున్నాడు.
మరో వైపు మెహర్ రమేష్ దర్శకత్వంలో తమిళ హిట్ మూవీ వేదాళం ను రీమేక్ చేస్తున్న విషయం తెల్సిందే.
అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా ఇప్పటికే జరిగాయి.ఆ సినిమా మొదటి షెడ్యూల్ జరిగిందని తెలుస్తోంది.
ఈ రెండు సినిమా లతో పాటు బాబీ దర్శకత్వం లో ఒక కొత్త కథతో సినిమా ను చేస్తున్నాడు.
ఈ సినిమా లు మూడు కూడా ఒక దాని తర్వాత ఒకటి అన్నట్లుగా కాకుండా మూడు సినిమా లు కూడా సమాంతరంగా షూటింగ్ లు జరుగుతున్నాయి.
"""/"/
గాడ్ ఫాదర్ సినిమా షూటింగ్ మద్యలో ఉండగా భోళా శంకర్ సినిమా పట్టాలెక్కింది.
త్వరలోనే వాల్తేరు వీరన్న సినిమా ను కూడా పట్టాలెక్కిస్తారట.మొత్తానికి మూడు సినిమాలు కూడా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ అవ్వబోతున్నందుకు గాను అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు.
ఇక ముఖ్య మైన విషయం ఏంటీ అంటే ఆచార్య విడుదల అయిన తర్వాత రెండు మూడు నెలల గ్యాప్ లో ఒకటి అన్నట్లుగా ఈ మూడు సినిమా లు వస్తాయని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.
అదే కనుక నిజం అయితే అభిమానులకు పండుగే.
సంక్రాంతికి వస్తున్నాం రివ్యూ & రేటింగ్