Actress Sujitha: నన్ను చూసి చిరంజీవి ఎమోషనల్ అయ్యారు.. నటి సుజిత కామెంట్స్ వైరల్?
TeluguStop.com
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు నటి సుజిత( Actress Sujitha ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.
మొదట చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సుజిత సీరియల్స్ ద్వారా భారీగా పాపులారిటీని సంపాదించుకుంది.
కేవలం సీరియల్స్ లో మాత్రమే కాకుండా పలు సినిమాలలో కూడా నటించి మెప్పించింది.
ఇక ఇటీవల స్టార్ మా లో ముగిసిన వదినమ్మ సీరియల్ తో( Vadinamma Serial ) తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువ అయింది.
కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళం మలయాళం సీరియల్స్ లో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఇప్పటికీ వరుసగా సీరియల్స్ లో నటిస్తూ దూసుకుపోతోంది సుజిత. """/" /
ఇది ఇలా ఉంటే తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
ఈ సందర్భంగా సుజిత మాట్లాడుతూ.జై చిరంజీవ షూటింగ్ రోజులను గుర్తు చేసుకున్నారు.
మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi ) నటించిన పసివాడి ప్రాణం సినిమాలో నేను చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాను.
ఆ సినిమాకు ప్రేక్షకులు ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోయారు.ఆ సినిమా తర్వాత నేను మళ్లీ చిరంజీవి గారిని చూసింది జై చిరంజీవ షూట్‌లోనే.
జై చిరంజీవ ఆఫర్ వచ్చినప్పుడు ఎన్నో ఏళ్ల తర్వాత ఆయన్ని కలుస్తున్నాననే ఆనందంతో ఉన్నాను.
"""/" /
ఫస్ట్ డే సెట్‌లో ఆయన్ని పట్టుకుని కన్నీళ్లు పెట్టుకున్నాను.ఆయన కూడా ఉద్వేగానికి లోనయ్యారు.
ఆ క్షణం సెట్ మొత్తం సైలెంట్ అయిపోయింది అని సుజిత తెలిపారు.అనంతరం, తన అన్నా వదిన సూర్యకిరణ్, కల్యాణి విడిపోవడానికి ఆర్థిక ఇబ్బందులే ప్రధాన కారణమని అన్నారు.
ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో భాగంగా ఏమి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ప్రస్తుతం సుజిత పలు తెలుగు సీరియల్స్ తో పాటు తమిళం మలయాళం సీరియల్స్ లో నటిస్తూ బిజీ బిజీగా ఉంది.
హీరో విశాల్ కి ఏమైంది… ఫుల్ క్లారిటీ ఇచ్చిన నటి కుష్బూ!