మారుతి మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్న చిరంజీవి..కారణం ఏంటంటే..?
TeluguStop.com
సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి( Chiranjeevi ) కి ఉన్న క్రేజ్ మరే హీరోకి లేదనే చెప్పాలి.
ప్రస్తుతం చిరంజీవి వరుస సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు.ఇక ఇలాంటి క్రమంలోనే చిరంజీవి చేస్తున్న సినిమాలను కనక మనం ఒకసారి చూసుకున్నటైతే ప్రస్తుతం వశిష్ఠ ( Vashishtha )దర్శకత్వంలో విశ్వంభర( అనే సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.ఇక ఈ సినిమా సంక్రాంతి కానుకగా వచ్చే సంవత్సరం ప్రేక్షకుల ముందుకు రానుంది.
"""/" /
అయితే ఇప్పుడు చిరంజీవి మారుతి తో ఒక సినిమా కూడా చేయబోతున్నాడు అనే వార్తలైతే వస్తున్నాయి.
ఇక ఇప్పటికే మారుతి ప్రభాస్ తో రాజాసాబ్( Rajasab ) అనే సినిమా చేస్తున్నాడు.
అయితే ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ అండ్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిస్తున్నాట్టు గా తెలుస్తుంది.
ఇక ఈ సినిమాతో మారుతి భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టబోతున్నాడనే అంచన వేస్తున్న చిరంజీవి తన నెక్స్ట్ సినిమాని మారుతితో చేయాలని ఫిక్స్ అవుతున్నట్టుగా తెలుస్తుంది.
"""/" /
ఇక ప్రభాస్ తో మారుతి చేస్తున్న సినిమా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతుంది.
కాబట్టి ఈ సినిమా కనక మంచి సక్సెస్ ని సాధిస్తే మారుతికి పాన్ ఇండియా డైరెక్టర్ గా మంచి గుర్తింపు వస్తుంది.
కాబట్టి దాన్ని క్యాష్ చేసుకోవాలనే ఉద్దేశ్యం తో చిరంజీవి మారుతి తో సినిమా చేస్తున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.
అయితే చిరంజీవి మారుతి కాంబినేషన్ లో సినిమా వస్తుంది అంటూ చాలా సంవత్సరాల నుంచి టాక్ నడుస్తున్నప్పటికీ ఆ సినిమా ఇప్పటివరకు అయితే పట్టాలెక్కలేదు.
మరి ఇప్పుడు ఆ సినిమా ఎప్పుడు స్టార్ట్ అయి ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది కూడా తెలియాల్సి ఉంది.
ఇక వీళ్ల కాంబినేషన్ లో వస్తున్న సినిమా ప్రేక్షకుల్లో మంచి అంచనాలతో రాబోతున్నట్టు గా తెలుస్తుంది.
నా కూతురికి నేనిచ్చే పెద్ద బహుమతి అదే.. రామ్ చరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్!