చిరంజీవి ఉదయం నిద్ర లేవగానే చూసే ఫోటో ఎవరిదో తెలుసా?

టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు.

ఇలా ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఈ స్థాయిలో ఉన్నారంటే దాని వెనుక ఎంతో కృషి ఉంటుందనే సంగతి మనకు తెలిసిందే.

అయితే ఈ విషయంలో చిరంజీవిని చాలామంది స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగుతూ ఉంటారు అయితే చిరంజీవి ( Chiranjeevi) కూడా ఇతరులను ఇదే విధంగా స్ఫూర్తిగా తీసుకొని నేడు ఈ స్థాయికి వచ్చారని చెప్పాలి.

తాజాగా చిరంజీవి మహానటి సావిత్రి( Savitri ) క్లాసిక్స్ బుక్ లాంచ్ కార్యక్రమానికి హాజరయ్యారు.

"""/" / హైదరాబాదులో జరిగినటువంటి ఈ కార్యక్రమానికి ఎంతోమంది సినీ ప్రముఖులు హాజరయ్యారు.

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరి ( Vijaya Chamundeswari ) పాల్గొని సందడి చేస్తారు.

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె మాట్లాడుతూ చిరంజీవి గారి గురించి ఎంతో గొప్పగా చెప్పారు.

ఒకసారి తాను చిరంజీవి గారిని కలవాలని వారి ఇంటికి వెళ్లినప్పుడు చిరంజీవి గారి కాలికి గాయమైంది కానీ నేను వచ్చానని తెలిసి ఆయన పైనుంచి చేతికర్ర సహాయంతో కిందికి వచ్చారని కిందికి వచ్చిన తర్వాత తనకు ఎంతో మర్యాద ఇచ్చారని విజయ చాముండేశ్వరి తెలిపారు.

"""/" / ఇక చిరంజీవి గారు నాతో మాట్లాడుతూ నేను ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే చూసే ఫోటో ఎవరిదైనా ఉంది అంటే అది సావిత్రమ్మ గారిది అని ఆమె ఫోటో నా బెడ్ రూమ్లో ఉంటుందని చిరంజీవి గారు ఆమెతో చెప్పారట అయితే ఇది నిజమా అబద్దమా అని నేను సందేహిస్తానని చెప్పి చిరంజీవి గారు ఆ ఫోటోని తీసుకువచ్చి మరి తనకు చూపించారట చిరంజీవి గారిలో తనకు నచ్చే విషయం ఇదేనని తెలిపారు.

చాలామంది చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉంటుంది.కానీ చిరంజీవి విషయంలో ఆలోచన, మాట, ఆచరణ మూడు ఒకేలా ఉంటాయని ఈమె వెల్లడించారు.

ఇక సావిత్రి క్లాసిక్స్ బుక్ ని చిరునే లాంచ్ చేయాలని భావించి.ఆయన చేతుల మీదుగా ఈ బుక్ లాంచ్ చేయడం గమనార్హం.

ఎంత లావుగా ఉన్నవారైనా రోజు ఈ డ్రింక్ తాగితే మల్లె తీగల మార‌తారు!