సిరివెన్నెల కోసం చిరంజీవి 2 రోజుల పాటు ఎందుకు వెతికాడు

తెలుగు సినిమా పరిశ్రమలో సినీ రచయితగా వెలుగొందిన సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణం టాలీవుడ్ లో విషాదాన్ని నింపింది.

తెలుగు సినిమా దర్శకులు, నిర్మాతలు, హీరోలతో మంచి సంబంధాలు కొనసాగించిన ఆయన.సడెన్ గా చనిపోవడం పట్ల అందరూ షాక్ కు గురవుతున్నారు.

అయితే సిరివెన్నెల ఒకానొక సమయంలో పలు చక్కటి అనుభూతులను గుర్తు చేసుకున్నాడు.ఇంతకీ ఆయన ఏం చెప్పాడో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

టాలీవుడ్ టాప్ హీరోమెగాస్టార్ చిరంజీవి.తనకొసం రెండు రోజులు వెతికాడని సిరివెన్నెల సీతారామశాస్త్రి వెల్లడించాడు.

తన సినీ కెరీర్ లో రాసిన రెండో పాట తన సినిమాలోనిదన్నాడు.కోదండ రామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన వేట సినిమాకు ఈ పాట రాశానని చెప్పాడు.

ఈ సినిమాలో పాటల గురించి మాట్లాడేందుకు దర్శకుడు తనను మద్రాసుకు పిలిచినట్లు చెప్పాడు.

"""/" / ఆయన చెప్పిన దాని ప్రకారం ఒక పాటను 20 రకాలుగా రాసినట్లు చెప్పాడు.

అప్పుడు పాటలు బాగా రాస్తున్నానని సంగీత దర్శకుడు చక్రవర్తి ట్యూన్ రాస్తావా అంటూ ఓ స్వరం ఇచ్చినట్లు చెప్పాడు.

అప్పుడు తాను రాసిన పాటే ఓ లేడి ట్యూనూ అని చెప్పాడు.ఖైదీ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న చిరంజీవి.

నేను రాసిన పాటలు విని చాలా గొప్పగా ఫీలయ్యాడని చెప్పాడు.నన్ను అభినందించేందుకు ఏకంగా నా కోసం రెండు రోజుల పాటు వెతికాడని చెప్పాడు.

అంత గొప్ప మనిషి చిరంజీవి అని చెప్పాడు సిరివెన్నెల. """/" / అటు స్వర్ణ కమలం సినిమాలోని శివపూజకు అనే పాటను రాయడానికి తనకు 15 రోజుల సమయం పట్టినట్లు వెల్లడించాడు.

అటు చక్రం సినిమాలోని జగమంత కుటుంబంనాది అనే పాటను 1970లోనే తాను రాసినట్లు చెప్పాడు.

ఈ పాట విని సినిమాలో పెట్టాలని దర్శకుడు కృష్ణవంశీ చెప్పాడట.ఆఖరికి చక్రం సినిమాలో ఈ పాటను పెట్టినట్లు వెల్లడించాడు.

అటు రానా హీరోగా చేసిన కృష్ణం వందే జగద్గురుంలో సిరివెన్నెల దశవతార రూపాకాన్ని రాశాడు.

తొమ్మిదిన్నర నిమిషాల పాటు సాగే ఈ పాట రాయడానికి చాలా సమయం పట్టినట్లు చెప్పాడు.

పవన్ కళ్యాణ్ కొత్త ఎన్నికల షెడ్యూల్..!!