సల్మాన్ పై మర్డర్ ప్లాన్.. గాడ్ ఫాథర్ ముంబై ఈవెంట్ పై ఎఫెక్ట్!

మెగాస్టార్ చిరంజీవి ప్రెసెంట్ జెట్ స్పీడ్ లో సినిమాలు పూర్తి చేస్తున్నాడు.ఇటీవలే ఆచార్య సినిమా ఎన్నో అంచనాల మధ్య వచ్చి మెగాస్టార్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ప్లాప్ గా నిలిచి పోయింది.

దీంతో ఈ సినిమా తర్వాత మెగాస్టార్ చేసే సినిమాలపై మరింత ఫోకస్ పెట్టి ఆ ప్లాన్ ను మరిపించాలని మరింత కృషి చేస్తున్నాడు.

ప్రెసెంట్ చిరు చేతిలో మూడు నాలుగు ప్రాజెక్టులు ఉన్నాయి.వాటిలో గాడ్ ఫాదర్ ఒకటి.

తమిళ్ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్ సినిమా తెరకెక్కుతుంది.ఈ సినిమా మలయాళ బ్లాక్ బస్టర్ లూసిఫర్ కు రీమేక్ గా తెరకెక్కుతుంది.

ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది.అక్టోబర్ 5న రిలీజ్ కాబోతున్నట్టు కూడా ఇప్పటికే ప్రకటించారు.

ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి.

ఈ సినిమా కోసం ముంబై తో పాటు అనంతపురంలో కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించ బోతున్నారు అని ఈ ఈవెంట్ కు గెస్ట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాబోతున్నాడు అంటూ టాక్ వినిపిస్తుంది.

"""/" / ఇక ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ కూడా కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలోనే ముంబై లో కూడా ఈవెంట్ గ్రాండ్ గా చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

కానీ ఇప్పుడు సల్మాన్ ఖాన్ పై మర్డర్ ఎటాక్ జరపడానికి ప్లాన్ చేసినట్టు పోలీసులు చెప్పడంతో ఈ ఈవెంట్ ముంబై లో క్యాన్సిల్ చేసి హైదరాబాద్ లో పెట్టబోతున్నట్టు తెలుస్తుంది.

"""/" / పంజాబ్ సింగర్ సిద్ధూ మూసేవాలా ను మర్డర్ చేసిన నిందితులే సల్మాన్ ఖాన్ ను కూడా మర్డర్ చేయడానికి రిక్కీ నిర్వహించారని డీజీపీ చెప్పడంతో ఇప్పుడు ఈ విషయం హాట్ టాపిక్ అయ్యింది.

మరి ఈ నేపథ్యంలో ఈ ఈవెంట్ ముంబై లో జరగడం అసాధ్యం అనే చెప్పాలి.

చూడాలి ముందు ముందు ఏం జరుగుతుందో.

ఈ ఏడాది ప్రభాస్ మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తారా.. రికార్డ్ క్రియేట్ చేస్తారా?